Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTelanganaWomenYouth

కలెక్టర్లు ఎన్యుమరేటర్లతో విస్తృతంగా మాట్లాడాలి

కలెక్టర్లు ఎన్యుమరేటర్లతో విస్తృతంగా మాట్లాడాలి

మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వండి

కుటుంబసర్వేపై వీడియో కాన్ఫరెన్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

✍️ హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 9)

ఇళ్ల గుర్తింపు (హౌస్ లిస్టింగ్) పూర్తిచేసుకుని ఇంటింటి సర్వే ప్రారంభిస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు ఇంటింటి సమగ్ర కుటుంబసర్వేపై ఎన్యుమరేటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. కుటుంబ సర్వేపై ఉన్నతాధికారులతో శనివారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. కలెక్టర్లు ఎన్యుమరేటర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడితే ప్రజల సందేహాలేమిటనేది వెను వెంటనే తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజల సందేహాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజలకు ఎప్పటికప్పుడు నివృత్తి చేసేలా చూడాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎక్కువసార్లు సర్వేలో భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే వంటి పెద్ద కార్యక్రమం ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్న అధికారులను డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా అభినందించారు. ప్రశ్నలు పకడ్బందీగా రూపొందించాలని, ఎన్యుమరేటర్లకు శిక్షణ, హౌస్ లిస్ట్ కూడా విజయవంతంగా పూర్తిచేశారని, ఇదే రీతిలో కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. దేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమంగా ఈ సర్వే నిబద్ధతను దేశం మొత్తం గమనిస్తోందన్నారు. జిల్లా కలెక్టర్లు చిన్న విషయం కూడా నిర్లక్ష్యం చేయకుండా, ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శితోపాటు, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. సర్వేపై అన్నిస్థాయిల్లో అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని ప్రధానంగా పట్టణాలపై దృష్టిపెట్టాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అధికారులతో జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ టెలీకాన్ఫరెన్స్

ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే గురించి భద్రాద్రి జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ జిల్లాలో క్షేత్రస్థాయి అధికారులతో శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్యుమరేటర్లు ప్రతి కుటుంబం పూర్తి, ఖచ్చితమైన సమాచారం నమోదు చేయాలని ఆదేశించారు.సర్వేలో ప్రజల సందేహాలు ఎప్పటికప్పుడు తీర్చాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. సేకరించిన సమాచారం ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని సమాచారం గోప్యంగా ఉంచాలని ఆదేశించారు. ఎన్యుమరేటర్లు సేకరించిన సమాచారం, వారికి కేటాయించిన కేంద్రాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా నిర్దిష్టసమయంలో ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. సూపర్ వైజర్లు మధ్యాహ్నం నుంచి క్షేత్ర స్థాయిలో సర్వే పర్యవేక్షించాలన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, భూమి, రుణాలు, వ్యవసాయం, స్థిరాస్తి, రేషన్ సహా పలు అంశాలపై ఎన్యుమరేటర్లు ఖచ్చితమైన వివరాలు సేకరించాలన్నారు. సర్వే సమయంలో ఆధార్‌, ధరణి పాస్‌బుక్‌, పాన్, రేషన్ కార్డు, సెల్‌ఫోన్‌ నంబర్లు కూడా నమోదు చేయాలి కాబట్టి ఆ పత్రాలు అందుబాటులో పెట్టుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఒక్కో కుటుంబ వివరాల సేకరణకు 10-20 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నందున పత్రాలు దగ్గర పెట్టుకుంటే ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు వివరాలు చెప్పడం సులభమవుతుందని, మొత్తం వివరాలు పూర్తయ్యాక తాను చెప్పిన వివరాలన్నీ నిజమేనని ప్రకటిస్తున్నట్లుగా కుటుంబ యజమాని సంతకం తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, సీపీఓ సంజీవరావు, కలెక్టరేట్ ఏఓ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రెండు కార్లలో 21 కేజీల గంజాయిని స్వాధీనం

Divitimedia

ఉత్సాహంగా సీఎం కప్ క్రీడాపోటీలు

Divitimedia

ఐకేపీ వరికోతయంత్రం లీజుకు అవకాశం

Divitimedia

Leave a Comment