Divitimedia
Bhadradri KothagudemHealthLife StyleSpot NewsTelanganaWomenYouth

ఇంటింటి కుటుంబసర్వే ప్రారంభించిన జిల్లా కలెక్టర్

ఇంటింటి కుటుంబసర్వే ప్రారంభించిన జిల్లా కలెక్టర్

✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 6)

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ బుధవారం మున్సిపాలిటీలోని 15వ వార్డులో ప్రారంభించారు. ఆయన ఎన్యుమరేటర్ సేకరిస్తున్న వివరాలు పరిశీలించి, సర్వే చేసిన ఇంటికి స్టికర్ అంటించారు. సర్వేలో తీసుకోవలసిన జాగ్రత్తలు, చేపట్టవలసిన చర్యలపై కలెక్టర్ ఆ ఎన్యుమరేటర్ కు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమగ్ర ఇంటింటి కుటుంబసర్వే కోసం జిల్లాలో మొత్తం 2761 ఎన్యుమరేషన్ బ్లాకులుండగా, అన్ని బ్లాకులకు ఎన్యుమరేటర్లను నియమించామన్నారు. ఒక్కొక్కరికి సర్వే కోసం 150గృహాలు కేటాయించామన్నారు. వచ్చే మూడురోజులు ఇళ్లగుర్తింపు కార్యక్రమం పూర్తిచేసిన తర్వాత గుర్తించిన గృహాలకు స్టిక్కర్లు అంటించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సర్వేలో ప్రజలు ఖచ్చితమైన సమాచారం తెలియజేయాలని, ఈ సర్వే ద్వారానే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుక బడిన తరగతులు, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలు మెరుగుపరచడానికి ప్రణాళికలు తయారు చేయడం, అమలు చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. సర్వేలో భాగంగా ప్రతి ఎన్యుమరేటర్ ప్రతి ఇంటికి వెళ్లి, ఆ కుటుంబసభ్యులు, వారి ఆదాయ వివరాలతోపాటు కుటుంబసభ్యులెవరైనా విదేశాల్లో ఉన్నారా? ప్రజా ప్రతినిధులుగా ఉన్నారా? వారి ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు వివరాల వంటి 75 రకాల ప్రశ్నలతో వివరాలు సేకరిస్తున్నారన్నారు.ప్రజలందరూ ఇంటింటి సర్వేలో పాల్గొనాలని సూచించారు. సర్వేలో భాగంగా ఫారం నింపే సమయంలో ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ వంటి పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజనస్వామి, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మణుగూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయాలి

Divitimedia

విధులకు ‘డుమ్మాకొట్టి’… పైరవీల బాట పట్టి…

Divitimedia

‘డీడబ్ల్యుఓ’గా మరోసారి స్వర్ణలతలెనినాకు బాధ్యతలు

Divitimedia

Leave a Comment