ఉపాధ్యాయులు ఓటుహక్కు నమోదు చేసుకోవాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 2)
వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకోసం ఉపాధ్యాయులు తమ ఓటుహక్కు నమోదు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలోని ఉపాధ్యాయులు తమ ఓటు నమోదుకు గడువు తేదీ ( నవంబర్ 6 )సమీపిస్తున్నందున, వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 2018 నవంబర్ ఒకటో తేదీ నుంచి 2024 అక్టోబర్ 31వరకు మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు ఫామ్ -19తో దరఖాస్తు నింపి ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో కూడా ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును https://ceotserms2.telangana.gov.in/mlc/form19.aspx వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటుహక్కు కోసం నమోదుకు జీవో నెంబర్ 49 ద్వారా అర్హులైన పాఠశాల ఉపాధ్యాయుల వివరాలను కలెక్టర్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంచే గుర్తించబడిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పరిధిలోని
* ఉన్నత పాఠశాలలు
* ప్రత్యేక పాఠశాలలు (వినికిడి లోపం, మెంటల్లీ రిటార్డెడ్, దృష్టి లోపం,ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్, రిఫార్మేటరీ స్కూల్స్, ఓరియంటల్ స్కూల్స్)
* పండిట్ శిక్షణ కళాశాలలు
* అధునాతన సంస్కృత పాఠశాలలు
* జిల్లా విద్య, శిక్షణా సంస్థలు
* ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ స్కూల్స్
* సంగీతం, నృత్య కళాశాలలు
* ఒకేషనల్ జూనియర్ కళాశాలలు
* ఓరియంటల్ ఉన్నత పాఠశాలలు
* అరబిక్ ఉన్నత పాఠశాలలు, కళాశాలలు
* జవహర్ నవోదయ విద్యాలయాలు
* కేంద్రీయ విద్యాలయాలు
* తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా నిర్వహించబడే రెసిడెన్షియల్ హైస్కూల్స్, ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేట్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ.
* ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్, సీటీఈలు (కళాశాలలు), ఉపాధ్యాయ విద్య.
* సిరామిక్ సంస్థలు, మైనింగ్ సంస్థలు
* సెంట్రల్ క్రాఫ్ట్స్ ఇన్స్టిట్యూట్స్
* విద్యా కళాశాలలు, పాలిటెక్నిక్‌లు
* పారిశ్రామిక శిక్షణా సంస్థలు, కేంద్రాలు (ఐటీఐలు)
* రాష్ట్ర మోడల్ స్కూల్స్
* కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు)