Divitimedia
Bhadradri KothagudemCrime NewsEntertainmentHealthHyderabadInternational NewsLife StyleNational NewsSportsSpot NewsTechnologyTelanganaTravel And Tourism

పోలీసు అధికారులు, సిబ్బందికి యోగా శిక్షణ కార్యక్రమం

పోలీసు అధికారులు, సిబ్బందికి యోగా శిక్షణ కార్యక్రమం

పోలీసుశాఖలో అందరూ దైనందిన జీవితంలో యోగా అలవర్చుకోవాలి : ఏఎస్పీ సాయిమనోహర్

✍️ దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (జూన్ 21)

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హేమచంద్రాపురంలోని జిల్లా పోలీసు హెడ్క్వార్టర్స్ లో జిల్లా అర్మ్డ్ రిజర్వ్ పోలీస్ అధికారులు, సిబ్బందికి శుక్రవారం యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) టి.సాయి మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ, నిత్యం శాంతి భద్రతల పరిరక్షణ కోసం బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ యోగా అలవాటుగా చేసుకోవాలని సూచించారు. యోగా సాధనతో ఒత్తిడిని దూరం చేసుకుని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటూ ఆరోగ్యం కాపాడుకోవచ్చని తెలియజేశారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్పవరం ఈ యోగా అని తెలిపారు. రాబోయే రోజుల్లో యోగాని ఒక క్రీడ వలే ఒలంపిక్స్ లో ప్రవేశపెట్టడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో 15 నిమిషాలపాటు యోగా సాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎంటిఓ సుధాకర్, ఆర్ఐ (ఆపరేషన్స్) రవి, అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, ఆర్ఐ (ట్రైనింగ్స్) నాగేశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

భద్రాచలంలో భయపెడుతున్న డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్

Divitimedia

జూనియర్ ఇంటర్ లో రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు

Divitimedia

బొగ్గు, ఇసుక లారీలతో ఇబ్బందులపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

Divitimedia

Leave a Comment