Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTelangana

గంజాయి, మత్తు పదార్థాలు రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపాలి

గంజాయి, మత్తు పదార్థాలు రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపాలి

బూర్గంపాడు పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ రోహిత్ రాజు

✍️ బూర్గంపాడు – దివిటీ (అక్టోబరు 28)

గంజాయి వంటి మత్తుపదార్థాలను అక్రమంగా రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. సోమవారం ఆయన బూర్గంపాడు పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్థానిక అధికారులకు, సిబ్బందికి పలు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు నిత్యం పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ సమర్థవంతంగా తమ విధులు నిర్వర్తించాలని సూచించారు. విధినిర్వహణ విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు.వర్టికల్స్ వారీగా ఎవరికి కేటాయించిన విధులను వారు సమర్థవంతంగా నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలుకేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, సీఐ వినయ్ కుమార్, ఎస్సైలు రాజేష్, నాగబిక్షం, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వరదలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి : ఆర్డీఓ

Divitimedia

ఎన్నికల సమాచారం మీడియాకు ఎప్పటికప్పుడు అందజేయాలి

Divitimedia

పెండింగ్ గ్రాంట్ కోసం కేంద్రమంత్రిని కలిసిన సీఎం

Divitimedia

Leave a Comment