సంస్క్రృతీ సంప్రదాయాలతోనే ఆదివాసీలకు మనుగడ
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ప్రముఖులు
భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు
✍️ భద్రాచలం – దివిటీ (ఆగస్టు 9)
తమ సంస్కృతీ సాంప్రదాయాలు కాపాడుకుంటూనే ఆధునిక సమాజంలో ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి చెందాలని పలువురు ప్రముఖులు సూచించారు. ఈ మేరకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో మారుతున్న పరిస్థితుల్లో తమ ఉనికిని చాటుకుంటూ అన్నిరంగాల్లో ఉన్నతంగా ఎదగాలని, అందుకోసం తమ సహకారం ఉంటుందన్నారు. జిల్లా పరిధిలో ప్రభుత్వపరంగా ఆదివాసీల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్, ఏపీఓ డేవిడ్ రాజ్, ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి స్థానిక అంబేద్కర్ కూడలి దగ్గరున్న ఆదివాసీ అమరవీరుల స్థూపాలకు పూలమాలలువేసి, ఆదివాసీ జెండా ఆవిష్కరణ చేసి శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణంలో నిర్వహించిన ఆదివాసీల ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ ఆదివాసి గిరిజనుల పిల్లల కోసం గిరిజన సంక్షేమశాఖ ద్వారా ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలలు నెలకొల్పి వారి విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గిరిజనులు స్వయంఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంభన సాధించి జీవించడానికి ఐటీడీఏ ద్వారా అనేక రకాల సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకే అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకలెక్టర్, పీఓ కొత్తగా బాధ్యతలు స్వీకరించినందున గిరిజనులకు సంబంధించిన ఏ సమస్య ఉన్నప్పటికీ తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా గిరిజనభవన్లో ఏర్పాటుచేసిన ఆదివాసీల నృత్యాలను వారు తిలకించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, వివిధ గిరిజన సంఘాల నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, ఏసీఎంఓ రమణయ్య, ఏటిడిఓ అశోక్, ఈఈ తానాజీ, ఏడీఏ భాస్కర్, గురుకులం ఆర్సీఓ నాగార్జునరావు, జీసీసీ డీఎం దావీద్, మేనేజర్ ఆదినారాయణ, ఆర్ఓఎఫ్ఆర్ డీటీ శ్రీనివాస్, గిరిజనసంఘాల నాయకులు పూనెం కృష్ణ దొర, పాయం రవివర్మ, శరత్ బాబు, మురళి, రమేష్, పుల్లయ్య, వీరస్వామి, శ్రీరామ్ మూర్తి, సుధారాణి, అరుణ, వెంకటరావు, వీరభద్రం, వివిధ గ్రామాలనుంచి వచ్చిన గిరిజన సంఘాల నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
——————-
ఆదివాసీ ప్రముఖులను సన్మానించిన అధికారులు
——————-
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలం ఐటీడీఏ నిర్వహించిన వేడుకలల వివిధ విభాగాలలో ప్రావీణ్యం సాధించిన ఆదివాసీలను సన్మానించారు.
క్రీడల విభాగంలో పాయంకుమారి, వైద్యవృత్తిలో డాక్టర్ తాటి మల్లేష్, న్యాయవిభాగంలో పాయం రవి, పర్షిక సోమరాజు, ఆదర్శరైతు పెనుబల్లి గంగరాజు, అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారుడు మిడియం బుజ్జి, సీనియర్ ఆదివాసీ నాయకులు సోంది వీరయ్య, పూనెం వీరభద్రం, సోయం కన్నరాజు, డోలి కళాకారుడు సకినం శ్రీను, ఆదివాసీ పురాణం చందా వీరయ్య, నాగుల శ్రీరామ్, ఆదివాసీ జాతీయ నాయకుడు గొంది వెంకటరమణ, ఆదివాసీ సీనియర్ నాయకుడు కల్తీ వీరమల్లు, ఆదివాసీ సింగర్స్ బృందం కొండ్రు సుధారాణి, ఆదివాసీ సింగర్ జోగా శ్రీనివాస్ లను సన్మానించారు. వీరితోపాటు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులందించారు. వ్యాసరచన పోటీలలో ఎం.సౌజన్య, రాకేష్ వర్ధన్, బి.శ్రావణి, ఉపన్యాస పోటీలలో సమీరా, మౌనిక, హర్షిణి బహుమతులు గెలుచుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వివిధ బృందాలకు కూడా బహుమతి ప్రదానం చేశారు.