‘టీజీఈడబ్ల్యుఐడీసీ’లో ‘దివిటీ’ ప్రకంపనలు…
ధీర్ఘకాలిక సెలవుపై వెళ్తున్న ‘అవినీతి తిమింగళం’
తవ్వేకొద్దీ వెలుగు చూస్తున్న అవినీతి, అక్రమాలు
✍️ హైదరాబాదు – దివిటీ (జులై 19)
పదిహేను రోజుల నుంచి పనులన్నీ వదిలేసి, సెలవు పెట్టకుండా రాష్ట్ర రాజధానిలో పైరవీలు చేసుకుంటున్న ఓ అవినీతి ఉన్నతాధికారి బాధ్యతారాహిత్యం గురించి ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా తమకేమాత్రం సంబంధంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. రెండుజిల్లాల్లో వందల సంఖ్యలో అభివృద్ధి పనులు పర్యవేక్షించాల్సిన ఆయన, అధికారిక విధులు పక్కన పెట్టి మరీ ఆ పైరవీలలో మునిగిపోయాడు. తన అవినీతి, అక్రమాలపై ఇంతకాలంగా ఎవరూ చర్యలు తీసుకోకపోవడంతో ఆయన ఇష్టారీతిన రెచ్చిపోతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వ సంస్థలోనైనా సెలవు పెట్టకుండా ఒకటి రెండు రోజులు విధులకు గైర్హాజరైతేనే ఒప్పుకోని పరిస్థితుల్లో, రెండు జిల్లాల ఉన్నతాధికారి పదిహేను రోజుల నుంచి గైర్హాజరులో ఉన్నప్పటికీ సంస్థ ఉన్నతాధికారులకు ఏ మాత్రం పట్టింపులేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ ఉన్నతాధికారి గురించి ఆయన కార్యాలయంలో ఈనెల 6వ తేదీ నుంచి వాకబు చేస్తున్న ‘దివిటీ మీడియా’ కు అసలు ఆయన రావడమే లేదని సిబ్బంది చెప్తున్నారు. కేవలం తన అనుచరగణంతో కుమ్మక్కై గతంలో చేసిన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకోవడమే తనకున్న ఉద్యోగ బాధ్యతగా భావిస్తున్నట్లు బయటపడేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే రెండు జిల్లాల్లోనూ వందల సంఖ్యలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షణ గురించి పక్కన పెట్టి మరీ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనే ఉండటం గమనార్హం. ఆ అధికారి చేసిన అవినీతి, అక్రమాల గురించి ఇటీవల “దివిటీ మీడియా” వరుస కథనాలు ప్రచురిస్తుండటం తెలిసిందే. వాటి నుంచి బయటపడేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్న ఆయన, ఇటీవలే బదిలీ అయిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారిని లోబర్చుకుని కాస్త విజయం సాధించాడు. నిబంధనలను పక్కన పెట్టి మరీ ఆ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి పోతూ పోతూ చేసిన సహాయం కూడా తనను రక్షించలేదని తెలుసుకున్న పరిస్థితుల్లో ఆ ‘అవినీతి అనకొండ’ ధీర్ఘకాలిక సెలవు పెట్టి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మొత్తం వ్యవహారాలపై విచారణ, దర్యాప్తు పూర్తయి, ఆయనతోపాటు అనుచరగణం మీద కఠినచర్యలు తీసుకునేవరకు ‘దివిటీ మీడియా’ సాగిస్తున్న అక్షర యఙ్ఞం “టీజీఈడబ్ల్యుఐడీసీ” సంస్థలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతటి దారుణమైన అవినీతిపరుడైన రెండు జిల్లాల ఉన్నతాధికారిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
************
అవినీతిపరుడైన అధికారిపై ఇప్పటివరకు ‘దివిటీ మీడియా’ ప్రచురించిన కథనాల లింకులు… ************
టీజీఈడబ్ల్యుఐడీసీ అక్రమాల్లో ‘ఫ్యామిలీ ప్యాకేజి’… https://divitimedia.com/4778/
అక్రమార్కులకే అందలం… అభివృద్ధికి మంగళం… https://divitimedia.com/4684/
అడ్డదారిలో బయటపడేందుకు అక్రమార్కుల యత్నం https://divitimedia.com/4906/
విధులకు డుమ్మాకొట్టి… పైరవీల బాట పట్టి…
https://divitimedia.com/4967/