బాధ్యతలు స్వీకరించిన ఓఎస్డీ, భద్రాచలం ఏఎస్పీ
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 3)
ఇటీవల తెలంగాణ ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వుల మేరకు జరిగిన బదిలీల ప్రక్రియలో భాగంగా కొత్తగూడెం ఓఎస్డీ (ఆపరేషన్స్)గా పరితోష్ పంకజ్, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్ సంక్వార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. భద్రాచలం ఏఎస్పీగా పనిచేస్తున్న పరితోష్ పంకజ్ కొత్తగూడెం ఓఎస్డీగా పదోన్నతి పొందారు. ఆ స్థానంలో జనగామ ఏఎస్పీగా పనిచేస్తున్న అంకిత్ కుమార్ సంక్వార్ బదిలీపై వచ్చి భద్రాచలం ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇరువురు అధికారులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజును మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కలు అందజేశారు. జిల్లా పరిధిలో బాధ్యతలు స్వీకరించిన అధికారులిద్దరిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు.