Divitimedia
Spot News

పట్టుబడిన వాహనాల వేలంలో రూ.15లక్షల పైగా ఆదాయం

పట్టుబడిన వాహనాల వేలంలో రూ.15లక్షల పైగా ఆదాయం

కొత్తగూడెంలో 323 వాహనాలను వేలం వేసిన పోలీసుశాఖ

✍️ కొత్తగూడెం – దివిటీ (జూన్ 28)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో వివిధ కేసులలో సీజ్ చేసిన 323 అన్ క్లెయిమ్డ్ వాహనాలను పోలీసులు వేలంపాట నిర్వహించగా, రూ.15.04లక్షల ఆదాయం లభించినట్లు ఎంటీఓ సుధాకర్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వేలంపాట నిర్వహించగా, పలు జిల్లాలనుంచి వేలం పాటలో అధికసంఖ్యలో హాజరయ్యారని వెల్లడించారు. 306 ద్విచక్ర వాహనాలు,17 కార్లు,ఆటోలకు వేలంపాట నిర్వహించినట్లు వివరించారు.ఈ వేలంపాట ద్వారా సేకరించిన రూ.15,04,000 ప్రభుత్వఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు. వేలంపాట నియమిత కమిటీ చైర్మన్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, నోడల్ అధికారిగా డీఎస్పీ మల్లయ్యస్వామి, సభ్యులుగా కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎంటీఓ సుధాకర్, అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు ఉన్నారని ఎంటీఓ సుధాకర్ వెల్లడించారు.

Related posts

తుఫాను పట్ల జాగ్రతలు తీసుకోవాలి : కలెక్టర్

Divitimedia

పాల్వలో పోలీసుల కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్

Divitimedia

ప్రైవేటు ఏజెన్సీ గుప్పిట్లో ‘ధరణి’ పోర్టల్…

Divitimedia

Leave a Comment