ఆత్మహత్యకు యత్నించిన వృద్ధురాలిని కాపాడిన బ్లూకోల్ట్స్ పోలీసులు
✍️ భద్రాచలం – దివిటీ (జూన్ 28)
భద్రాచలంలో గోదావరి స్నానగట్టాల వద్ద శుక్రవారం నదిలో దిగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వృద్ధురాలిని భద్రాచలం బ్లూకోల్ట్స్ సిబ్బంది కాపాడారు. కొత్తగూడెం రామవరం కాలనీకి చెందిన భారతి అనే వృద్ధురాలు కడుపునొప్పితో బాధపడుతూ తన పిల్లలను ఇబ్బంది పెట్టలేక ఆత్మహత్యకు పాల్పడటానికి ప్రయత్నించారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆ వృద్ధురాలిని కాపాడిన పోలీసులు, చికిత్స కోసం భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటనలో అప్రమత్తతతో విధులు నిర్వర్తించిన భద్రాచలం బ్లూకోల్ట్స్ పోలీసు కానిస్టేబుల్ అధికారులు సురేంద్ర, జంపయ్యను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.