Divitimedia
Bhadradri KothagudemHealthHyderabadLife StyleSpot NewsTechnologyTelangana

కలెక్టరునే తప్పుదోవ పట్టించేందుకు విఫలయత్నం

కలెక్టరునే తప్పుదోవ పట్టించేందుకు విఫలయత్నం

పాల్వంచ మున్సిపల్ డీఈకి షోకాజ్ నోటీస్

త్రాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరిక

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ మీడియా (జూన్ 12)

తాగునీటి సమస్యపై ప్రజలు కలెక్టరుకు ఫిర్యాదు చేస్తే, బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన ఓ ఉన్నతాధికారి ఏకంగా జిల్లాకలెక్టరునే తప్పుదోవ పట్టించేందుకు తీవ్ర స్థాయిలో విఫలయత్నం చేశారు. ఫలితంగా ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి. పాఠశాలల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పాల్వంచ మండలం ప్రశాంత్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల బుధవారం పాల్గొన్నారు. తమకు తాగునీరు సరఫరా చాలాకాలం నుంచి అందడంలేదని
ఈ సందర్భంగా స్థానికులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లాకలెక్టర్ మున్సిపల్ డీఈ మురళీకృష్ణ నుంచి వివరణ కోరగా, తాము త్రాగునీరు సరఫరా చేస్తున్నామని ఆయన వివరణ ఇచ్చారు. దీంతో కలెక్టర్ దగ్గరలోని ఓ ఇంట్లోకి స్వయంగా వెళ్లి అక్కడ కులాయి తిప్పి మంచినీరు వస్తున్నదో? లేదో?నని పరిశీలించారు. అక్కడ ప్రజలను అడగగా తమకు త్రాగునీరు సరఫరా కావడంలేదంటూ తెలిపారు. త్రాగునీరు రావడంలేదనే విషయం నిర్ధారించుకున్న కలెక్టర్ డా.ప్రియాంకఅల, ఈ విషయంలో తప్పుడు సమాచారం అందించినందుకు మున్సిపాలిటీ డీఈ మురళీకృష్ణకు షోకాజ్ నోటీస్ జారీచేయవలసిందిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనకు ఆదేశాలు జారీచేశారు. తక్షణమే ఆ ప్రాంతంలో తాగునీటిసరఫరా పునరుద్దించాలని కూడా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరాపై తనకు నివేదిక సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. బాధ్యతగా ఉండాల్సిన అధికారులు కూడా అవసరమైతే ఉన్నతాధికారులను ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తారనేందుకు ఈ సంఘటన అద్దం పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

వైద్యఖర్చుల కోసం నేస్తం ట్రస్ట్ సాయం

Divitimedia

కొత్త ఓటర్ల నమోదుకు అక్టోబరు 31 చివరి గడువు

Divitimedia

ఇల్లందులో టీఎస్ఆర్టీసీ కొత్త డిపో ప్రారంభం

Divitimedia

Leave a Comment