Divitimedia
Andhra PradeshDELHIHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTelangana

రైతు రుణమాఫీకి అవసరమైతే ‘స్పెషల్ కార్పొరేషన్’…

రైతు రుణమాఫీకి అవసరమైతే ‘స్పెషల్ కార్పొరేషన్’…

ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

విభజన అంశాలపై చర్చకు 18న తెలంగాణ కేబినెట్ సమావేశం

✍️ దివిటీ మీడియా – హైదరాబాదు (మే 15)

తెలంగాణాలో రైతులకు చేయాల్సిన రూ.2లక్షల మేరకు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై బుధవారం ఆయన అధికారులను అడిగి వివరాలు, పరిస్థితులు తెలుసుకున్నారు. రైతుల రుణమాఫీ కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ విషయంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కల్లాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
—————-
విభజన అంశాలపై చర్చకు 18న తెలంగాణ కేబినెట్ సమావేశం
—————-
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వచ్చే జూన్2వ తేదీ నాటికి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించడానికి ఈ నెల 18న కేబినేట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. షెడ్యూల్ -9, షెడ్యూల్ -10 లో పేర్కొన్న ప్రకారం ఇంకా పెండింగ్ లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల అంశాలు, ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీ వంటివాటిపై నివేదిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజన చట్టం ప్రకారం ఇప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. ఈ పదేండ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Related posts

కలెక్టరేట్ లో ఉత్సాహంగా బాలల దినోత్సవ వేడుకలు

Divitimedia

సీతారామ లిఫ్ట్ పంపుహౌస్ పరిశీలించిన జిల్లాకలెక్టర్

Divitimedia

అనుమాస్పదస్థితిలో యువకుడి మృతి

Divitimedia

Leave a Comment