జూనియర్ ఇంటర్ లో రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు
✍️ దివిటీ మీడియా – అశ్వాపురం (ఏప్రిల్ 24)
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో అశ్వాపురం మండల కేంద్రానికి చెందిన షేక్ రూబీనా రాష్ట్రస్థాయి అత్యుత్తమ ప్రతిభ చూపింది. కొత్తగూడెంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతూ, ఎంపీసీ గ్రూపులో 467/470 రాష్ట్రస్థాయి మార్కులు సాధించింది. తన తండ్రి షేక్ రియాజ్ జిరాక్స్ సెంటర్ నడుపుతూ చదివించారు. ఈ సందర్భంగా పలువురు పరిచయస్తులు, స్థానిక ప్రముఖులు రాష్ట్రస్థాయిలో మార్కులు సాధించినందుకు ఆమెకు, కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.