సంక్షేమ పథకాలకు ప్రత్యేకాధికారుల నియామకం
✍ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 6
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఐదు గ్యారంటీలు మహాలక్ష్మి, చేయూత, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు పథకాల అమలుకు ప్రత్యేకాధికారులను నియమిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా అధికారులను నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల బుధవారం ఆదేశాలు జారీ చేశారు.