Divitimedia
Bhadradri KothagudemEntertainmentHyderabadLife StyleNational NewsSportsTelanganaYouth

జాతీయ మాస్టర్స్ టీటీ పోటీల్లో ప్రతిభ చాటిన ‘గూడెంవాసి’

జాతీయ మాస్టర్స్ టీటీ పోటీల్లో ప్రతిభ చాటిన ‘గూడెంవాసి’

సింగిల్, డబుల్స్ లో పతకాలు సాధించిన లోకేష్

✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం, ఫిబ్రవరి 13

గోవాలోని పటోర్డాలో మార్చి 8నుంచి 13వరకు జరిగిన జాతీయస్థాయి ‘మాస్పర్స్ టేబుల్ టెన్నిస్’ విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన కొత్తగూడెం నివాసి ఇడుపుగంటి లోకేష్ సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం, డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేశాడు. సింగిల్స్ విభాగంలో సెమీ ఫైనల్స్ లో ప్రస్తుత సింగిల్స్ విజేత అర్జున్ (కేరళ) పై ఓడినప్పటికీ మూడవస్థానం కోసం జరిగిన పోరులో అద్భుత ప్రతిభ కనబర్చి కాంస్యపతకం సాధించాడు. డబుల్స్ విభాగంలో ఖమ్మంకు చెందిన యాకూబ్ ఆలీతో జోడీగా బరిలోకి దీసిన లోకేష్ జంట ఫైనల్స్ లో కేరళకు చెందిన సునీత్, అర్జున్ జంటపై 11-9, 8-11, 9-11, 7-11 స్కోరుతో పరాజయం చెంది రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. లోకేష్, యాకూబ్ ఆలీలు జాతీయ స్థాయి మాస్చర్స్ టేబుల్ టెన్నిస్ పోటీలలో పతకాలు సాధించడం పట్ల సీనియర్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ప్రేంకుమార్, శ్రీనివాస్, థామస్, ఎం.వి.రమణ, చందు, రియాజ్, ఫణి, ఇమ్మానియేల్, రాంబాబు, వర్ధన్ రావు తదితరులు హర్షం వ్యక్తంచేశారు.

Related posts

జిల్లా సమిష్టికృషి ఫలితమే జాతీయ అవార్డు

Divitimedia

ఐటీసీలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా

Divitimedia

జామాయిల్ నర్సరీల వాహనాలటోల్ గేట్ హక్కుల వేలం

Divitimedia

Leave a Comment