తహశీల్దారు కార్యాలయంలో క్రిస్మస్ కానుకల పంపిణీ
✍🏽 దివిటీ – బూర్గంపాడు
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున శనివారం (డిసెంబర్ 23) బూర్గంపాడు తహశీల్దారు కార్యాలయంలో క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. బూర్గంపాడు జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, తహశీల్దారు తిరుమలాచారి మడలంలోని పలు గ్రామాలకు చెందిన క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి స్వప్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, నాయకుడు చల్లా వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.