Divitimedia
Crime NewsHyderabadLife StylePoliticsTelangana

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ 

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ 

హైద‌రాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్త‌కోట శ్రీ‌నివాసరెడ్డి

✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు

తెలంగాణా రాష్ట్రంలోని ప‌లువురు పోలీస్ ఉన్న‌తాధికారులను బ‌దిలీ చేస్తూ డీజీపీ ర‌విగుప్తా మంగళవారం (డిసెంబర్ 12) ఉత్త‌ర్వులు విడుదల  చేశారు. ఈ బదిలీల్లో ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్, రాజకొండ పోలీస్ క‌మిష‌న‌ర్ల‌ను మార్చారు. హైద‌రాబాద్ కమిషనర్ గా కొత్త‌కోట శ్రీ‌నివాసరెడ్డి, రాచ‌కొండ కమిషనర్ గా సుధీర్‌బాబు, సైబరాబాద్ కమిషనర్ గా అవినాష్ మహంతిల‌ను నియ‌మించారు. సందీప్‌ శాండిల్యాను ప్రభుత్వం కీలకమైన యాంటీ నార్కోటిక్ వింగ్‌ డైరక్టర్‌గా నియమించింది. ఈ విభాగాన్ని పూర్తి స్థాయిలో శక్తివంతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌, రాచకొండ కమిషనర్లుగా ఉన్న చౌహాన్‌, ఆనంద్‌లను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు.

Related posts

బూర్గంపాడులో గడపగడపకు కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభం

Divitimedia

ఎన్నికల్లో సహకరించినవారందరికీ ధన్యవాదాలు

Divitimedia

కాంగ్రెస్ పార్టీ లీడర్ రివ్యూకు హాజరైన అధికారులు?

Divitimedia

Leave a Comment