మోరంపల్లిబంజర్ క్రికెట్ లీగ్ -2023 విజేత డార్క్ లెవెన్
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర్ గ్రామంలో జరిగిన మోరంపల్లి బంజర్ క్రికెట్ లీగ్ -2023 టోర్నీలో డార్క్ లెవెన్ జట్టు విజేతగా నిలిచింది. ఫ్రెండ్స్ యూత్ లెవెన్ జట్టు రన్నర్స్ గా నిలిచారు. నాలుగురోజుల పాటు నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున బహుమతులు అందజేశారు. ఈ టోర్నీలో బెస్ట్ బ్యాట్స్ మెన్ మేడం తేజేశ్వర్ రెడ్డి, బెస్ట్ బౌలర్ బండారి సందీప్, మేన్ఆఫ్ ద సీరీస్ బండారి సాయి బహుమతులను గెలుచుకున్నారు. మంగళవారం (అక్టోబరు 24) జరిగిన బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యుడు రేగా కాంతారావు చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, ట్రస్ట్ చైర్మన్ బత్తుల రామ కొండారెడ్డి, వైస్ చైర్మన్ చింతా అంకిరెడ్డి, బీఆర్ఎస్ మండల నాయకులు కామిరెడ్డి రామకొండారెడ్డి, టోర్నీ నిర్వాహకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.