Divitimedia
Bhadradri KothagudemHanamakondaHyderabadJayashankar BhupalpallyKhammamMahabubabadMuluguNalgondaPoliticsTelanganaWarangalYouth

పీవైఎల్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

పీవైఎల్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

ముగిసిన రాష్ట్ర మహాసభలు, పలు తీర్మానాలు ఆమోదం

✍🏽 దివిటీ మీడియా – మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు జరిగిన ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) తెలంగాణ రాష్ట్ర 8వ మహాసభలు విజయవంతంగా ముగిశాయి.
ఈ సందర్భంగా ప్రతినిధుల సభలో సంఘం రాష్ట్ర నూతనకార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. పీవైఎల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా కె.ఎస్.ప్రదీప్ (హైదరాబాద్), ప్రధాన కార్యదర్శిగా వాంకుడోత్ అజయ్ (భద్రాద్రి కొత్తగూడెం), ఉపాధ్యక్షులుగా ఈశ్వర్ (నారాయణపేట), ఎన్.వి. రాకేష్ (ఖమ్మం), సహాయ కార్యదర్శులుగా ప్రతాప్ (నారాయణపేట), ఎం. రవికుమార్ (హైదరాబాద్), కోశాధికారిగా వాసం బుచ్చిరాజు (భద్రాద్రి కొత్తగూడెం), కమిటీ సభ్యులుగా జె భారత్, మోహన్ రెడ్డి,మంద సురేష్, ప్రేమ్ సింగ్ (ఖమ్మం), కాకా వెంకటేష్, గణేష్, దేవా, కుర్సా రామకృష్ణ (భద్రాద్రి కొత్తగూడెం), అనీష్, నవీన్ కుమార్ (నిజామాబాద్), భూషణ వేణికృష్ణ (హైదరాబాద్), సిద్దు (నారాయణపేట), ఇరుగు అనిల్, కందాల రంగయ్య (మహబూబాబాద్), పెండ్యాల రమేష్ (పెద్దపల్లి), ఆంజనేయులు (వనపర్తి), దేవా (మహబూబ్ నగర్ ), ఆత్రం వినోద్ (అదిలాబాద్), సుందర్ (నిర్మల్ )లను మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రత ఎక్కువగా ఉందని, నిరుద్యోగులు నోటిఫికేషన్లు, ఉద్యోగాలు లేక అసహనానికి గురై ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొన్నదని పి.వై.ఎల్ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కె.ఎస్ ప్రదీప్, వాంకుడోత్ అజయ్ అన్నారు. నేటి యువతరం నిరుద్యోగసమస్య పరిష్కారం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం మెడలు వంచే విధంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. విద్యార్థి, నిరుద్యోగులు ఆత్మహత్యల వైపు ఆలోచించకుండా, పోరాటాల వైపు ఆలోచించి ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా మహాసభ పలు తీర్మానాలను ఆమోదించింది.

  1. మెగా డీఎస్సీ వేయాలి.

2.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 80 వేల పోస్టులను భర్తీ చేయాలి.

3.గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ అభ్యర్థులకు నెలకు పదివేల రూపాయల స్టైఫండ్ ఇవ్వాలి.

4.నిరుద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలి.

5.అర్హులైన నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి అందించాలి.

6.బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.

7.పేదలకు ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలి. కార్పొరేట్ ఆసుపత్రులలో ఫీజుల దోపిడీని అరికట్టాలి.

8.గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు రెగ్యులర్ గా హెల్త్ క్యాంపులు నిర్వహించాలి.

9.అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి : ఎస్పీ డా.వినీత్

Divitimedia

మెడికల్ ఆఫీసర్ కు సీఐటీయూ వినతిపత్రం

Divitimedia

అమరారం గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే సమీక్ష

Divitimedia

Leave a Comment