బ్రిలియంట్ లో అబ్బురపరిచిన బతుకమ్మ సంబరాలు
దివిటీ మీడియా – సారపాక
సారపాకలోని బ్రిలియంట్ విద్యాసంస్థల్లో బొడ్డెమ్మ పండుగకు చివరి రోజు, బతుకమ్మ పండుగకు స్వాగతం పలుకుతూ శుక్రవారం ఘనంగా సంబురాలు నిర్వహించారు. ఈ సంబురాల్లో భాగంగా పాఠశాల ఆవరణలో సరస్వతిదేవి అమ్మవారి సమక్షంలో, ప్రధాన ఉపాధ్యాయురాలు స్వర్ణకుమారి, సాంప్రదాయబద్దంగా అమ్మవారికి పూలమాల అలంకరించి గౌరీదేవి పూజ నిర్వహించారు. బ్రిలియంట్ విద్యాసంస్థల విద్యార్థులు ఉదయగిరి, ఆరావలి, నీలగిరి టీమ్స్ విద్యార్థులు తీరొక్క పువ్వులతో బతుకమ్మలు తయారుచేసి తీసుకొచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులతో బతుకమ్మ పాటలు నృత్యాలతో బతుకమ్మ సంబరాలను కన్నుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బి నాగేశ్వరరావు మాట్లాడుతూ, యావత్ ప్రపంచంలోని ఆడ పడచులు బతుకమ్మ పండుగను ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారన్నారు. తెలంగాణ ఆడపడుచులకు ఇది ఒక పెద్ద పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. తొమ్మిది రోజులు వరుసగా మన ప్రకృతిలోని ఎన్నోరకాల పూలు తీసుకొచ్చి ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేక దేవతామూర్తిగా అలంకరించి పండుగ జరుపుకుంటారని వివరించారు. తొమ్మిది రోజుల తర్వాత తెలంగాణలో బావులు, చెరువులు పూలతో నిండి కాలుష్య నిర్మూలన జరుగుతోందని, కాబట్టి మన సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోకుండా పండుగలను ఇదేవిధంగా జరుపుకోవాలని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.