Divitimedia
Bhadradri KothagudemEducationKhammamSportsTelanganaYouth

అక్టోబరు 3, 4 తేదీల్లో జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు

అక్టోబరు 3, 4 తేదీల్లో జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు

✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం

ఉమ్మడి ఖమ్మంజిల్లా అండర్-17 బాలురు, బాలికల పాఠశాలల భోబో జట్ల ఎంపికలు ఈ నెల 3వ తేదీన బాలికలకు, 4వ తేదీన బాలురకు, ఉదయం 9 గంటలకు కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించ నున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వరచారి ఆదివారం ఒక ప్రకటనలోపేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఈ బాలబాలికల పోటీలు ఈ నెల 13 నుంచి 16 వరకు వనపర్తి జిల్లాలో జరగనున్నట్లు భద్రాది కొత్తగూడెం పాఠశాల క్రీడల నిర్వాహక కార్యదర్శి టి.స్పెల్లా తెలిపారు. జిల్లా పరిధిలోని 17 సంవత్సరాల లోపు వయసు బాలబాలికలు (2007 జనవరి 1 తరువాత జన్మించిన), 9,10 తరగతులు, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్దులు ఈ పోటీలలో పాల్గొనేందుకు అర్హులని ఆమె వివరించారు. ఈ ఎంపికలలో పాల్గొనాలనే విద్యార్థినీ, విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, పదవ తరగతి మెమోను తప్పనిసరిగా తమవెంట తీసుకు రావాలని స్టెల్లా తెలిపారు. ఇతర వివరాల కోసం ఎంపికల కోఆర్థినేటర్ పి.వీరరాఘవయ్యను 9440669401 సెల్ ఫోన్ నెంబరులో సంప్రదించాలని కోరారు.

Related posts

బూర్గంపాడులో గడపగడపకు కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభం

Divitimedia

గంజాయిని అరికట్టడంలో జిల్లా పోలీసుల పనితీరు భేష్

Divitimedia

భారత్ లేబర్ ప్రజా పార్టీ రద్దుకు ప్రతిపాదన

Divitimedia

Leave a Comment