Divitimedia
Bhadradri KothagudemTelanganaWomen

‘చెవిలో పువ్వు… చేతిలో చిప్ప…’

‘చెవిలో పువ్వు… చేతిలో చిప్ప…’

16వ రోజు అంగన్ వాడీల వినూత్న నిరసన

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు

‘చెవిలో పువ్వు… చేతిలో చిప్ప…’తో అంగన్ వాడీ సిబ్బంది ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తంచేశారు. వేతనాల పెంపుదల, తదితర తమ డిమాండ్ల సాధన కోసం 16 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీల సిబ్బంది మంగళవారం(సెప్టెంబర్ 26వతేదీ) ఈ విధంగా వినూత్నమైన రీతిలో నిరసన వ్యక్తం చేశారు. 16వ రోజు సమ్మె శిబిరాన్ని సందర్శించిన సిఐటియు అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.పద్మ, ఆ సంఘం జిల్లా నాయకురాలు అనసూయ అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. 16రోజులుగా సమ్మె కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవడం సరైంది కాదని అన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయకపోగా అంగన్ వాడీ సమ్మె విచ్చిన్నం చేయాలని అధికారులు చూస్తున్నారని విమర్శించారు. సమ్మెను విచ్చన్నం చేస్తే ఈ సమ్మెను మరింతగా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాధికారులు దీనిపై స్పందించి డిమాండ్స్ పరిష్కారం చేయాలని అన్నారు. కార్మికసంఘాలను పిలిచి చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాలన్నారు. స్వయంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఆగస్టు 18న చర్చలు జరిపి, ఇచ్చిన హామీని కూడా అమలు చేయకుండా విస్మరించినందుకే ఈ సమ్మె చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా చర్చలు జరిపి హామీలు ఇచ్చిన డిమాండ్స్ అమలు చేయాలన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఎక్కువ జీతాలు ఇస్తున్న రాష్ట్రాల గురించి చెప్పకుండా తక్కువ జీతాలిస్తున్న రాష్ట్రాల గురించి చెప్పడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికైనా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల మాదిరిగా పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనంగా రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్, రిటైర్మెంట్ బెనెఫిట్స్ కింద టీచర్లకు రూ.10లక్షలు, హెల్పర్లకు, మినీ టీచర్లకు రూ.5 లక్షలు ఇవ్వాలని, వస్తున్న జీతంలో సగం ప్రతినెల పెన్షన్ కింద ఇవ్వాలని, మినీ టీచర్లను ఎటువంటి షరతులు లేకుండా మెయిన్ టీచర్లుగా గుర్తించాలని కోరారు. అంగన్ వాడీలలో లబ్ధిదారులకు మెరుగైన పౌష్టికాహారం అందించాలని, మెనూచార్జీలు పెంచాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన జీతం ఇవ్వాలని, 2017 నుంచి పెండింగ్ లో ఉన్న టిఎ,డిఎలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కె సత్య, ఏఐటీయూసీ రమణ, సీఐటీయూ పుల్లమ్మ, ఈశ్వరి, ఏఐటీయుసీ శ్రీదేవి, లలిత, సీఐటీయు పద్మ, భారతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వరంగల్- ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల

Divitimedia

రైతు దంపతులను సన్మానించిన కలెక్టర్

Divitimedia

రూ.90లక్షల విలువైన గంజాయి పట్టుకున్న పోలీసులు

Divitimedia

Leave a Comment