Divitimedia
Bhadradri KothagudemPoliticsTelangana

పినపాక నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన

పినపాక నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు, మణుగూరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. బూర్గంపాడు, మణుగూరు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలతోపాటుగా, ప్రారంభోత్సవాలు చేశారు. బూర్గంపాడులో ఆర్ఎంఎస్ఎ కింద రూ.2.70 కోట్ల ఖర్చుతో నిర్మించిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం భవనాలను ప్రారంభించారు. బూర్గంపాడులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సి.హెచ్.సి) అవరణలో రూ.2.70 కోట్లతో డి.ఎం.ఎఫ్.టి కింద నిర్మించనున్న నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు. తర్వాత
మణుగూరు శివారులో ఆంజనేయస్వామి ఆలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రథంగుట్ట అర్బన్ పార్కును ప్రారంభించి, ఆ ఆవరణలో మొక్కలునాటారు. మణుగూరు పట్టణంలో ఎస్డీఎఫ్ నిధులు రూ.5 కోట్లతో టీఎస్ఆర్టీసీ నూతన బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరో రూ.25 కోట్లు ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించనున్న నూతన మున్సిపల్ కార్యాలయ భవనం, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, తదితర అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా
మణుగూరులోని కిన్నెర కల్యాణమండపం లో ప్రభుత్వవిప్, స్థానిక ఎమ్మెల్యే అయిన రేగా కాంతారావు అధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడి, నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల, ఎస్పీ డాక్టర్ వినీత్, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, పాల్వంచ డీఎస్పీ వెంకటేశ్, స్థానిక జడ్పీటీసీ సభ్యులు కామిరెడ్డి శ్రీలత, పోశం నర్సింహరావు, జిల్లా అధికారులు, పలువురు బీఆర్ఎస్ స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

‘జమిలి ఎన్నికలపై’ హైలెవెల్ కమిటీ తొలి సమావేశం

Divitimedia

ఎస్.సి.ఇ.ఆర్.టి విధులకు ఎంపికైన ఇందిరాప్రియదర్శిని

Divitimedia

‘ఐసీడీఎస్’లో అధికారుల వసూళ్లపై ఆర్జేడీ విచారణ

Divitimedia

Leave a Comment