రెండో ఏఎన్ఎంల డిమాండ్లపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ (జి) విభాగం శనివారం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, రెండో ఏఎన్ఎం ల పరిస్థితులు, డిమాండ్లపై అధ్యయనం కోసం అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం రిజ్వి శనివారం మెమో నం.7716/జి/2023-1 ద్వారా ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ కమిటీకి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఛైర్ పర్సన్ గా, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ మెంబర్ కన్వీనరుగా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరో సభ్యుడిగా ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన సిఫార్సులతోపాటు వివరణాత్మక నివేదికను ప్రభుత్వానికి వీలైనంత త్వరగా సమర్పించే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.