Divitimedia
Andhra PradeshPolitics

 తాగి బండి నడిపితే ఇంక అంతే సంగతులు

విజయవాడ నగరంలో మందు తాగి మత్తులోనే వాహనాలు నడుపుతున్న 49 మందికి కోర్టులు ఏకంగా జైలు శిక్షతోపాటు అదనంగా జరిమానా కూడా విధించారు. ఈ మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వివరాలు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. విజయవాడ నగర పోలీసు కమీషనర్ క్రాంతిరాణా టాటా ఆదేశాలతో నగరంలో వివిధ ప్రదేశాలలో పోలీసులు, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు శుక్రవారం ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించారు. 2వ, 3వ, 4వ పట్టణ ట్రాఫిక్ పోలీసులు మొత్తం 49 కేసులను నమోదు చేశారు. ఈ కేసులలో పట్టుబడిన నిందితులను సంబంధిత న్యాయస్థానాలలో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం వారు జైలు శిక్షలతోపాటు జరిమానా కూడా విధించారు. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

Related posts

నేడు జిల్లాకు రానున్న ఎంపీ రఘురాంరెడ్డి

Divitimedia

ఐఎన్టీయూసీ మిత్రపక్షాల వినూత్న నిరసన

Divitimedia

ప్రత్యేక ఓటరు సవరణ క్యాంపులు పకడ్బందీగా నిర్వహించాలి

Divitimedia

Leave a Comment