రైతు వేదికలో మూడురోజుల విత్తన మేళా
ప్రత్యామ్నాయ పంటల సాగు మేలు
మండల వ్యవసాయ శాఖాధికారి శంకర్
✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలకేంద్రంలో ఉన్న రైతువేదికలో మూడు రోజులపాటు విత్తనమేళా నిర్వహించునున్నట్లు ఏఓ (మండల వ్యవసాయ శాఖ అధికారి) శంకర్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే మంచిదని ఆయన సూచించారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపిందని ఏఓ గుర్తు చేశారు. రైతులు విత్తనమేళాలో అధికసంఖ్యలో పాల్గొని ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలు కొనుగోలు చేయాలని కోరారు. తక్కువకాలంలో అధికంగా దిగుబడులు సాధించే చిరుధాన్యాల పంటలు మేలని, వర్షాభావప్రాంతాల్లో రైతులు ఈ పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. రైతువేదికలో మూడు రోజులపాటు నిర్వహించనున్న విత్తన మేళాలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

