Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTelangana

ఇంగ్లీష్, గణితంలో వెనుకబడిన గిరిజన విద్యార్థులు

ఇంగ్లీష్, గణితంలో వెనుకబడిన గిరిజన విద్యార్థులు

సామర్థ్యాలు మెరుగుపర్చాలని ఐటీడీఏ పీఓ ఆదేశాలు

✍️ పాల్వంచ – దివిటీ (డిసెంబర్ 18)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఇంగ్లీష్, గణితంలో కనీస సామర్ధ్యాలు లేకపోవడం వల్ల చదువులో వెనుకబడిపోతున్నారు. ఈ వెనుకబాటు గుర్తించిన భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్, విద్య బలోపేతం చేయడానికి ఉద్దీపకంగా వర్క్ బుక్స్ ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. పాల్వంచ మండలంలో నాగారంతండా, తోగ్గూడెం జీపీఎస్ పాఠశాలలను సందర్శించిన పీఓ ఉద్దీపకం వర్క్ బుక్స్ సంబంధించిన పాఠ్యాంశాలను విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారో పరిశీలించారు. అక్కడి పిల్లలతో బోర్డుపై రాయించి ఒక్కొక్కరిని లేపి, ఆ వర్క్ బుక్స్ లోని సారాంశాలను పిల్లల్లో దాగివున్న ప్రతిభ, నైపుణ్యాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలంతా ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పడం పట్ల ఐటీడీఏ పీఓ రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న గిరిజన పిల్లలు ఇంగ్లీష్, గణితంలో వెనుకబడి పోతున్నందున గణిత ప్రాథమికస్థాయి సంఖ్యల నుంచి కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు, వాటికి సంబంధించిన కృత్యాలు, చిత్రాలతో సహా ఆనందంగా, ఆహ్లాదంగా, ఆసక్తిగా నేర్చుకునే విధంగా రూపొందించామని తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో రూపొందించిన ఉద్దీపికలు విద్యార్థులు తమంతట తామే వాటిలోని కృత్యాలు, బొమ్మల ఆధారంగా చదివి, కృత్యాలు చేసేవిధంగా రూపొందించడం జరిగిందన్నారు. విద్యార్థినీ విద్యార్థులు పాఠశాలల్లో నేర్చుకున్నదే గాక తర్వాత ఇంటిదగ్గర ప్రాక్టీస్ చేసుకునేందుక్కూడా అనుగుణంగా వర్క్ బుక్ ను తయారు చేసినట్లు పీఓ వివరించారు. సంబంధిత ఉపాధ్యాయులు క్రమంతప్పకుండా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దీనిలోని పాఠ్యాంశాలను విద్యార్థులకర్థమయ్యే రీతిలో బోధించాలని, మరల పిల్లలచేత బోర్డుపై రాయించి, ఇతర విద్యార్థులకు చూపించాలన్నారు. విద్యార్థులు వర్క్ బుక్స్ లోని చతుర్విద ప్రక్రియలు అర్థం చేసుకున్నట్లు గ్రహించానన్న ఐటీడీఏపీఓ ఉపాధ్యాయులను అభినందించారు. ఈ రీతిలోనే అన్ని జీపీఎస్ పాఠశాలల్లోనూ విద్యార్థుల పట్ల శ్రద్ధచూపి బోధిస్తే తప్పని సరిగా ప్రైవేట్ స్కూల్స్ కు దీటైనవిధంగా గిరిజన సంక్షేమ పాఠశాలల్లో గిరిజనుల విద్య మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఏటీడీఓ చంద్ర మోహన్, పీజీహెచ్ఎం బద్రు, ఎస్సీఆర్పీ హరిలాల్, ఉపాధ్యాయులు సుజాత, పద్మ, రాంబాబు, పుల్లమ్మ పాల్గొన్నారు.

Related posts

అర్థరాత్రి ఇసుక దొంగలు… అధికారుల కళ్లకు గంతలు…

Divitimedia

మహిళలపై అత్యాచారాలు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం

Divitimedia

సత్తుపల్లిలో తెలంగాణ, ఏపీ సరిహద్దు జిల్లాల ఉన్నతాధికారుల సమావేశం

Divitimedia

Leave a Comment