Divitimedia
Bhadradri KothagudemLife StylePoliticsSpot NewsTelangana

ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్‌ స్టేషన్లు

ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్‌ స్టేషన్లు

రాజకీయ పార్టీలతో డీపీఓ చంద్రమౌళి

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 10)

త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి వి.చంద్రమౌళి తెలిపారు. మంగళవారం పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, ఓటర్ల జాబితాల ప్రచురణ, నియమావళిపై రాజకీయ పార్టీల నాయకులతో ఆయన జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఆర్‌డీఓ విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లాలో చేపట్టబోతున్న ఏర్పాట్లను డీపీఓ చంద్రమౌళి, పాల్గొన్న నాయకులకు వివరించారు. గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఓటర్ల జాబితాల ఆధారంగా ఏ ఇబ్బందులు కలుగకుండా పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ముసాయిదా జాబితా షెడ్యూల్‌ ప్రకారం ప్రకటించనున్నట్లు చెప్పారు. మండలస్థాయిలో ఎంపీడీవోల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాలు ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రకటించిన పోలింగ్‌ స్టేషన్లలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 12 వరకు తెలియజేయాలన్నారు. ఎంపీడీఓల ద్వారా పోలింగ్‌ కేంద్రాల తుది జాబితా 17న ప్రచురిస్తామని తెలిపారు. జిల్లాలో 479 గ్రామపంచాయతీలు, 4232 వార్డులలో ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంచుతామని అన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలని, త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమావేశానికి సీపీఐ నుంచి సలిగంటి శ్రీనివాస్, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నుంచి గౌని నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ నుంచి సంకుబాపన అనుదీప్, సీపీఎం నుంచి అన్నవరపు సత్యనారాయణ, బీఎస్పీ నుంచి జి.మల్లికార్జునరావు, బీజేపీ నుంచి నోముల రమేష్, కాంగ్రెస్‌ నుంచి లక్ష్మణ అగర్వాల్‌ హాజరయ్యారు.

Related posts

ఐటీసీ-ప్రథమ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు

Divitimedia

అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై కలెక్టర్ జితేష్ వి పాటిల్

Divitimedia

మాదిగల జనసభ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

Divitimedia

Leave a Comment