Divitimedia
Andhra PradeshDELHIHyderabadInternational NewsLife StyleNational NewsPoliticsSpot NewsTelanganaWomen

జగన్ పై తాజాగా తీవ్ర ఆరోపణలు చేసిన షర్మిల

జగన్ పై తాజాగా తీవ్ర ఆరోపణలు చేసిన షర్మిల

హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన షర్మిల

✍️ హైదరాబాద్ – దివిటీ (నవంబరు 22)

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ పై ఆయన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలారెడ్డి తాజాగా మరింత తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె తన సోదరుడిపై మరింత పదునైన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన షర్మిల ఏమన్నారో ఆమె మాటల్లోనే… “జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్ లా అదానీ కి రాసి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ను “అదానీ ప్రదేశ్ “ గా మార్చారు. 1750 కోట్ల లంచాలకు ఆంధ్ర ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారు. జగన్ అవినీతి ప్రపంచానికి తాకింది. ఇది వైఎస్ఆర్ కుటుబానికి, రాష్ట్రానికి అవమానం. అదానీతో జగన్ చేసుకున్న ఒప్పందాలు అన్నింటిపై విచారణ జరగాలి.
ఏపీలో అదానీ గ్రూప్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి” అంటూ వ్యాఖ్యానించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే…

  • అగ్రరాజ్యం బయటపెట్టే దాకా అదానీ, జగన్ లంచాల గురించి తెలియలేదు.
  • ఇక్కడ ఉన్న ప్రభుత్వ శాఖలు ఏం చేస్తున్నట్లు ?.
  • అంతర్జాతీయ స్థాయిలో మన దేశ అవినీతి గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది.
  • ఇది మన దేశానికి అవమానం.
  • అదానీ దేశ పరువు తీస్తే… జగన్ ఆంధ్ర రాష్ట్రం పరువు తీశాడు.
  • ఒక్క డీల్ లో 1750 కోట్లు లంచమా ?.
  • జగన్ గారు మీకు ఆంధ్రరాష్ట్ర ప్రజల ప్రయోజనాలు గుర్తుకు రాలేదా ?.
  • మీకు లంచాలు… ఇక్కడ డిస్కంలకు నష్టాలు.
  • మీకు1750 కోట్లు లంచాలు..ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన 17 వేల కోట్ల సర్దుబాటు చార్జీలు.
  • మీ లంచాల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీకి తాకట్టు పెడతారా ?.
  • గుజరాత్ లో ఇదే అదానీ యూనిట్ కి 1.99 పైసలు అమ్ముతున్నాడు.
  • ఆంధ్రలో మాత్రం 2.49 పైసలకు అగ్రిమెంట్ చేసుకున్నారు.
  • 1750 కోట్ల లంచం తీసుకొని ప్రజల నెత్తిన అదానీ పవర్ భారాన్ని మోపారు.
  • 25 ఏళ్లు డీల్ కి ప్రజలపై పడే భారం లక్ష కోట్లు.
  • ఈ లక్ష కోట్లు అదానీకి దోచిపెట్టే కుట్రలో మీ లంచం ఎంత ?.
  • లంచాలు ఇస్తే ప్రజల మనోభావాలను తాకట్టు పెడతారా?.
  • జగన్ అవినీతిపరుడు అని ప్రపంచం మొత్తం చర్చ.
  • ఇది వైఎస్ఆర్ కుటుంబానికి, రాష్ట్రానికి అవమానం.
  • ప్రజలు 5 ఏళ్లు అధికారం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేశారు.
  • 1750 కోట్ల లంచాలకు ఆశపడి జగన్ రిప్యుటేషన్ ను తాకట్టు పెట్టాడు.
  • అదానీతో ఇదొక్కటే కాదు… ఇక్కడ జరిగిన ప్రతి డీల్ లో లంచాలు తీసుకొని ఉంటాడు.
  • ఎటువంటి దర్యాప్తులు లేవు కాబట్టి బయటపడటం లేదు.
  • రాష్ట్రాన్ని అదానీకి జగన్ తాకట్టు పెట్టాడు.
  • గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశాడు.
  • కేవలం 640 కోట్లకు అదానీకి కట్టబెట్టారు.
  • 30 ఏళ్ల తర్వాత గంగవరం పోర్ట్ ప్రభుత్వానికి చెందాలి.
  • 10 శాతం ఉన్న వాటాను అమ్మేశారు.
  • 9 వేల కోట్ల విలువ జేసే 10 శాతం వాటాను కేవలం 640 కోట్లకు అమ్మడం ఏంటి ?.
  • ఇలా అమ్మితే ఎంత కమీషన్ తీసుకున్నారు ?.
  • కృష్ణపట్నం పోర్టు బెదిరించి అదానీకి ఇప్పించారు.
  • రాష్ట్రం మొత్తం కోల్ సప్లై చేసే కాంట్రాక్టు అదానీకి ఇచ్చారు.
  • బీచ్ శాండ్ కాంట్రాక్టు మొత్తం అదానీ చేతుల్లో పెట్టారు.
  • విశాఖలో సబ్ మెరైన్ కాంట్రాక్టు కూడా అదానీ చేతుల్లో పెట్టాలని అనుకున్నారు.
  • అదానీకి ఇచ్చిన కాంట్రాక్టు లకు ఎంత లంచం తీసుకున్నారు ?.
  • చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
  • విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్ ను రద్దు చేయండి.
  • అదానీ కంపెనీని ఏపీలో బ్లాక్ లిస్ట్ లో పెట్టండి.
  • జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలను రివ్యూ చేయాలి.
  • ఈ దేశంలో వందల కొద్ది మోదాని స్కాంలు ఉన్నాయి.
  • దేశం మొత్తం ఇంత స్కాంలు జరుగుతున్నా మోడీ చర్యలు లేవు.
  • ఇప్పుడు అమెరికా అదానీ అరెస్టు వారెంట్ ఇచ్చింది.
  • ఇప్పటికైనా మోడీ స్పందించాలి.
  • అదానీపై చర్యలు తీసుకోవాలి.
  • లేకుంటే మోడీ కూడా అదానీ అవినీతిలో భాగం.
  • అదానీ గత 10 ఏళ్లలో బాగా ఎదిగాడు.
  • దేశంలో రెండో ధనవంతుడు.
  • ఇది మోడీ అండ లేకుంటే సాధ్యం కాదు.
  • అమెరికాలో అదానీ బండారం బయటపడటం ఈ దేశానికి అవమానం.
  • మోడీనీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం.
  • ఇండియా – అమెరికా మధ్య ఒప్పందాలు ఉన్నాయి.
  • ఎక్కడ నేరస్తుడు పట్టుబడిన వెంటనే ఆ దేశానికి అప్పగించాలి.
  • మరి అదానీని మోడీ అమెరికాకి అప్పగిస్తారా ?.
  • మోడీ నిర్ణయం ఎంటో తేల్చాలి.
  • మీ నిర్ణయం కోసం దేశ ప్రజలు అంతా చూస్తున్నారు.
  • రేవంత్ ను కూడా విజ్ఞప్తి చేస్తున్నా.
  • అదానీ విషయంలో పునరాలోచన చేయాలి.
  • జగన్ గారు మొన్న ఒక వీడియో ప్లే చేశారు.
  • జగన్ కి నిజంగా చెల్లెలి మీద ప్రేమ ఉండి ఉంటే..
  • బాలకృష్ణ లేదా ఆయన బిలింగ్ నుంచి తప్పుడు ప్రచారం జరిగింది అని తెలిసి ఉంటే….
  • మీరు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా అన్నారు.
  • అప్పుడు గాడిదలు కాశారా?.
  • ఎందుకు బాలకృష్ణ మీద విచారణ జరిపించలేదు ?.
  • చెల్లెలి మీద ప్రేమ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు?.
  • నాకు అక్రమ సంబంధాలు అంటకట్టిన వాళ్ళు ఎవరో కూడా నాకు ఇప్పటికీ తెలియదు.
  • నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా.
  • గత 5 ఏళ్లుగా నీ సోషల్ మీడియా సైన్యంతో నాపై తప్పుడు ప్రచారం చేయించలేదా ?.
  • మీకు అవసరం అనుకుంటే అందరినీ వాడుతారు.
  • చివరికి నా వీడియో కూడా వాడుతారు.
  • అమ్మను కేసు పెడతారు.. నాన్న పేరు సీబీఐ ఛార్జ్ షీట్ లో పెట్టిస్తారు.
  • మీకు మీరే సాటి జగన్ సార్..

Related posts

బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీరామ్

Divitimedia

ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ

Divitimedia

జెన్కో సీఎండీ సంతకం ఫోర్జరీ చేసిన ఐటీసీ ఎంప్లాయ్

Divitimedia

Leave a Comment