గ్రూప్-3 పరీక్షల్లో మెహందీ, టాటూలు నిషిద్దం
ఏర్పాట్లు పూర్తయ్యాయన్న అదనపు కలెక్టర్
✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 15)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మెహందీ, టాటూలు
పెట్టకుండా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. బయోమెట్రిక్ విధానం కారణంగా మెహందీ, టాటూలు పెట్టకుండా ఉండాలని ఆయన సూచించారు. ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లాలో 39 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. 13478మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని ఆయన వెల్లడించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షల కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. అభ్యర్థులు తమ వెంట సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, లాగ్ టేబుల్స్, బ్యాగులు తెచ్చుకోవడం నిషేధమని స్పష్టం చేశారు.