Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadKhammamLife StylePoliticsSpot NewsTelanganaYouth

హిందువులు, ముస్లింలు ప్రభుత్వానికి రెండుకళ్లు

హిందువులు, ముస్లింలు ప్రభుత్వానికి రెండుకళ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

✍️ హైదరాబాద్ – దివిటీ (నవంబరు 11)

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించడం విషయంలో రాష్ట్రంలోని హిందూ ముస్లింలను తమ ప్రభుత్వం రెండు కళ్లలా భావిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించడానికి అందరి సహకారం కావాలని ఆయన కోరారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా సోమవారం రవీంద్రభారతిలో జాతీయ విద్యా, మైనారిటీ సంక్షేమ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం మౌలానా అబుల్ కలాం చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఆధునిక విద్యకు మౌలానా అబుల్ కలాం బలమైన పునాది వేశారని పేర్కొన్నారు. ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా దేశానికి అత్యుత్తమ విద్యావిధానం అందించారని చెప్పారు. హిందువులు, ముస్లింల మధ్య విభజన రాజకీయాలు దేశానికి నష్టం చేకూర్చుతాయని, అలాంటివి దేశాన్ని బలహీనపరిచే చర్యలుగా వివరించారు. తమ ప్రభుత్వంలో మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను ఇస్తున్నామని అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (TGMREIS) రూపొందించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌ను సీఎం ప్రారంభించారు. 2019 నుంచి 2024 వరకు ప్రతి ఏటా అందించే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అవార్డులు, మఖ్దూమ్ అవార్డును, 21 మంది ప్రముఖులకు లైఫ్‌టైమ్ అవార్డులను ఈ వేదిక నుంచి సీఎం చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ఆమెర్ అలీఖాన్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీజీఎంఆర్ఈఐఎస్ ప్రెసిడెంట్ ఫహీమ్ ఖురేషీ, తెలంగాణ ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ తాహెర్ బిన్ అహ్మద్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, పలువురు నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

అంగన్వాడీలకు వేతనం పెంచాలని కలెక్టరేట్ ముట్టడి

Divitimedia

రెండో ఏఎన్ఎంల డిమాండ్లపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Divitimedia

ఆత్మహత్యకు యత్నించిన వృద్ధురాలిని కాపాడిన బ్లూకోల్ట్స్ పోలీసులు

Divitimedia

Leave a Comment