గ్రూప్-3 పరీక్షలకు అంతా సిద్ధం : జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 8)
జిల్లాలో ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 39 పరిక్షాకేంద్రాల్లో 13848 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని ఆయన వెల్లడించారు. రెండు సెషన్లలో జరుగనున్న ఈ పరీక్షల్లో 17న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ -1, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5-30వరకు పేపర్ -2 పరీక్షలుంటాయని వివరించారు. 18న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు పేపర్-3 పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి కమిషన్ వెబ్ సైట్ https://WWW.TSPSC.GOV.IN నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఏవైనా సాంకేతిక సమస్యలుంటే అభ్యర్థులు టీజీపీఎస్సీ టెక్నికల్ హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లు : 040-23542185, 040-2354 2187లలో సంప్రదించాలని, లేదంటే HELPDESK@TSPSC.GOV.IN కు ఇమెయిల్ చేయవచ్చని సూచించారు.