ప్రతిభావంతులకు మెరిట్ స్కాలర్ షిప్పులు
✍️ బూర్గంపాడు – దివిటీ (అక్టోబరు 19)
ఐటీసీ అనుబంధ రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్రా – సారపాక తరపున తమ కంపెనీలో పనిచేస్తున్న సర్వీస్ ప్రొవైడర్ ఉద్యోగుల పిల్లలకు శుక్రవారం సాయంత్రం స్కాలర్ షిప్పులు అందజేశారు. 2023-24 పదనతరగతి పబ్లిక్ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా స్కాలర్ షిప్పులు అందజేశారు. యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్ అధ్వర్యంలో రోటరీక్లబ్ ప్రెసిడెంట్ డీవీఎం నాయుడు, సెక్రటరీ ఎ.సాయిరాం పాల్గొన్నారు. ప్రెసిడెంట్ డీవీఎం నాయుడు మాట్లాడుతూ, స్కాలర్షిప్పుల విధి విధానాలు, ఎంపిక ప్రక్రియ గురించి వివరించారు. విరాళాల రూపంలో సహకరించిన దాతలు మహిళా సమితికి, ఉన్నత స్థానాల్లో రిటైరైన మేనేజర్లు, కాంట్రాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ పూర్వప్రెసిడెంట్ జేకే దాస్, శ్యాంకిరణ్, డేవిడ్ ఆలివర్, రంజిత్, చాంద్ భాషా, చెంగల్ రావు, మహళాసమితి సెక్రటరీ ఆల్క, శ్రీలత, శైలు, గిరిజ, పి. దుర్గాప్రసాద్, యు.వి.రావు, బసప్ప రమేష్, యేసోబు, రామకృష్ణ, ఉమామహేశ్వరి, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.