విద్యార్థులకు సామగ్రి పంపిణీ చేసిన ఎంఈఓ
✍️ కొత్తగూడెం – దివిటీ (అక్టోబరు 19)
పాతకొత్తగూడెంలో ప్రభుత్వ ప్రత్యేకపథకంలో భాగంగా నిర్వహించబడుతున్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు శనివారం ఎంఈఓ ప్రభుదయాల్ పలు రకాల వస్తువులు అందజేశారు. వివిధ కారణాలతో బడి మానేసిన విద్యార్థులు, వీధి బాలురు, ఆసరాలేని వారు ఈ పాఠశాలలో చదువుతున్నారు. ఇటీవలే జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ పాఠశాలను సందర్శించి ప్రత్యేక వసతులు కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ స్కూల్ విద్యార్థులకు అవసరమయ్యే ప్రాథమిక వస్తువులు రాత పుస్తకాలను వెంటనే తెప్పించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఆ పాఠశాలకు అన్ని సౌకర్యాలు సమకూరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో
కలెక్టర్ సూచన మేర, నేడు ప్రతి విద్యార్థికి ఒక ప్లేటు, గ్లాసు, మూడు దుప్పట్లు, ఒక దిండు, రెండు దిండు కవర్లు, ఒక కార్పెట్ చొప్పున శనివారం మండల విద్యాశాఖాధికారి ప్రభుదయాల్ అందించారు. కలెక్టర్ ప్రత్యేకంగా ఇస్తున్న వస్తువులు చక్కగా వాడుకుంటూ చదువుకోవాలని, స్వయంకృషితో ఉన్నత స్థాయిని సాధించాలని చెప్తూ, విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. సిబ్బంది మొత్తం విద్యార్థుల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ ముక్త కంఠంతో కలెక్టర్ కు కృతఙ్ఞతలు తెలిపారు.