సీతారాం ఏచూరి మరణం సిపిఎం పార్టీకి తీరనిలోటు
✍️ బూర్గంపాడు – దివిటీ (సెప్టెంబర్ 14)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురంలో శనివారం సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు సిపిఎం దివంగత నేత సీతారాం ఏచూరి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు సీతారాం ఏచూరి ఉద్యమ ప్రస్థానం, ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, సిఐటియు కోకన్వీనర్ గుంటక కృష్ణ, బాలరాజు, సాయి, అశోక్, రామయ్య, రమేష్, వెంకటేశ్వర్లు, ప్రదీప్, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.