Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTelanganaWomen

“గ్రీవెన్స్ డే”లో జిల్లా ఎస్పీకి సమస్యలు తెలుపుకున్న బాధితులు

“గ్రీవెన్స్ డే”లో జిల్లా ఎస్పీకి సమస్యలు తెలుపుకున్న బాధితులు

విచారణ జరిపి త్వరగా పరిష్కరించాలని ఆదేశించిన ఎస్పీ రోహిత్ రాజు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 12)

గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ఏడుగురు బాధితులనుంచి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమస్యలనడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలను సత్వర పరిష్కరించేలా అధికారులు తక్షణం విచారణ జరిపి, ఆ బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు. నలుగురు బాధితులు తమ ఫిర్యాదుల మేరకు నమోదైన కేసులలో జాప్యం లేకుండా విచారణ జరిపించి న్యాయం చేకూర్చాలని కోరారు. ఒక భాధితురాలు తనను, తన పిల్లలను తన భర్త మూడు సంవత్సరాలుగా పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని కోరారు. మరో ఇద్దరు భాధితులు ఇటీవల తమ ఇళ్లలో జరిగిన దొంగతనాల కేసుల విషయమై వివరించి, దొంగలను పట్టుకుని తమ సొత్తును తమకు అందేవిధంగా చేసి, తమకు న్యాయం చేకూర్చాలని కోరారు.

Related posts

కొండరెడ్ల అభివృద్ధికి ప్రత్యేక కృషి

Divitimedia

కార్యకర్తలకు వెన్నంటే ఉంటా : వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్

Divitimedia

మణుగూరుకు రూ.83.25లక్షల సింగ‌రేణి నిధులు

Divitimedia

Leave a Comment