బూర్గంపాడులో మొక్కలు నాటిన అధికారులు
✍️ బూర్గంపాడు – దివిటీ (ఆగస్టు 9)
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “స్వచ్చదనం – పచ్చదనం” కార్యక్రమంలో భాగంగా బూర్గంపాడులో మండల అధికారులు శుక్రవారం మొక్కలు నాటారు. ప్రజలందరూ ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండి.ముజాహిద్, ఎంపీడీఓ కె.జమలారెడ్డి, ఎంపీఓ ఎస్.సునీల్ కుమార్, ఏపీఓ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి సమ్మయ్య, ఐసీడీఎస్, మెడికల్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.