స్పోర్ట్స్ స్కూల్ రాష్ట్రస్థాయి పోటీలకు 24మంది ఎంపిక
✍️ కొత్తగూడెం – దివిటీ (జులై 2)
హైదరాబాదులోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతిలో ప్రవేశాల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో ఎంపికలు మంగళవారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించారు. ఈ ఎంపికల్లో జిల్లాలోని దాదాపు అన్ని మండలాల నుంచి 120 మంది బాల బాలికలు పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో వీరందరికీ తొమ్మిది బ్యాటరీ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 14 మంది బాలురు, 10 మంది బాలికలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 9, 10 తేదీల్లో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు వీరిని పంపిస్తామని జిల్లా యువజన, క్రీడల అధికారి కె.సంజీవరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఈటీ, పీడీ సెక్రెటరీ స్టెల్లా, 15మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఉదయ్ కుమార్, తిరుమలరావు, లక్ష్మణ్, ఆర్చెరీ కోచ్ కళ్యాణ్ పాల్గొన్నారు.