Divitimedia
Bhadradri KothagudemLife StylePoliticsSpot NewsTelangana

బూర్గంపాడులో సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు

బూర్గంపాడులో సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు

✍️ దివిటీ మీడియా

సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు బూర్గంపాడు మండలకేంద్రంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చ వెంకటేశ్వర్లు పార్టీ విశిష్టత గురించి వివరించారు. పార్టీ నిర్మాణం, కర్తవాలపై రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే రమేష్ సభ్యులకు వివరించారు. దేశంలో సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని, వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మికవర్గంపై పెద్ద ప్రమాదం మంచుకొస్తుందని తెలిపారు. అందుకే నిరంతరం ప్రజల తరఫున సీపీఎం పార్టీ కార్యకర్తలు, నాయకులు పోరాటాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలనలో పెట్టుకున్న దరఖాస్తులు అధికారులు సక్రమంగా ఆన్లైన్ చేయకపోవటం వల్ల బూర్గంపాడు మండల ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని, వెంటనే ఆ సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ గా మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు వ్యవహరించారు. కార్యక్రమంలో సీపీఎం స్థానిక నాయకులు, ప్రతినిధులు పాపినేని సరోజిని, బయ్యా రాము, ఎస్ కే అబిధా, అజయ్ కుమార్
పి.రామనాథం, రాయల వెంకటేశ్వర్లు, కనకం వెంకటేశ్వర్లు, గుంటుక కృష్ణ, నిమ్మల అప్పారావు, పాండవులు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూత

Divitimedia

కలెక్టరేట్ లో మళ్లీ మళ్లీ అదే నిర్లక్ష్యమా…?

Divitimedia

ఆన్ లైన్ ద్వారా ఎండీఎం బిల్లుల చెల్లింపులకు చర్యలు

Divitimedia

Leave a Comment