లక్ష్మీపురంలో రూ.కోటి ఎంపీ ల్యాడ్స్ నిధులతో కల్యాణమండపం
భూమిపూజ చేసిన జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, గ్రామస్థులు
.✍ దివిటీ మీడియా – బూర్గంపాడు, ఫిబ్రవరి 29
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో రూ.1కోటి వ్యయంతో ఫంక్షన్ హాల్ నిర్మించనున్నారు. స్థానిక ముత్యాలమ్మ గుడి ఆవరణలో ఎంపీ లాడ్ నిధులతో నూతనంగా నిర్మించనున్న ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, బూర్గంపాడు పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, గ్రామస్థులు గురువారం భూమిపూజ(శంకుస్థాపన) చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత మాట్లాడుతూ మహబూబూబాద్ ఎంపీ మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సహకారంతో ఎంపీ లాడ్ నిధులతో బూర్గంపాడు మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీలలో అభివృద్ధి పనులు చేశామన్నారు. దాదాపు రూ.2.28కోట్ల వ్యయంతో నూతన ఫంక్షన్ హల్, సీసీ రోడ్లు, సీసీ డ్రైయిన్లు మంజూరయ్యాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం బీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడు పోతిరెడ్డి గోవిందరెడ్డి, మాజీ సర్పంచులు సోంపాక నాగమణి, గద్దల ప్రకాష్, సొసైటీ డైరెక్టర్ మేడగం రామిరెడ్డి, మాజీ వార్డ్ మెంబెర్లు పాలం దివాకరరెడ్డి, తోకల రమణ, బందెల వెంకటేశ్వర్లు, లక్ష్మీపురం గ్రామపంచాయితీ సెక్రెటరీ కిరణ్, గ్రామ పెద్దలు చింతా పున్నారెడ్డి, ఏటుకూరి లక్ష్మయ్య, చింతా పెద్దబ్రహ్మారెడ్డి, దారం క్రిష్ణారెడ్డి, ఏటుకూరి చిన్నఅప్పారావు, కామిరెడ్డి రామకొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.