Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadLife StyleTechnologyTelanganaYouth

గాంధీనగర్ శ్రీసత్యసాయి స్కూలుకు సంజయ్ సింగ్ వితరణ

గాంధీనగర్ శ్రీసత్యసాయి స్కూలుకు సంజయ్ సింగ్ వితరణ

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు

సారపాకలోని ఐటీసీ పీఎస్ పీడీ అనుబంధ రోటరీక్లబ్ ఆఫ్ ఇన్‌భద్రా ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ శ్రీసత్యసాయి స్కూలుకు ఐటీసీ పీఎస్ పీడీ సీఎంసీ మెంబర్ సంజయ్ సింగ్ 2 ట్యాబులు, ఒక ప్రింటర్ సహాయం అందించారు. ఐటీసీ పీఎస్ పీడీ అనుబంధ రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా సారపాకకు ఛార్టర్డ్ ప్రెసిడెంట్ అయిన సంజయ్ సింగ్ బాలలకు వికాసం కోసం ఈ సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఐటీసీ పీఎస్ పీడీ అధికారి చెంగలరావు చేతుల మీదుగా వాటిని ఆదివారం స్కూలు యాజమాన్యానికి అందజేశారు. ఆ స్కూల్ యాజమాన్యం ఈ సందర్భంగా సంజయ్ సింగ్ అందజేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా ప్రెసిడెంట్ జయంత్ కుమార్ దాస్ మాట్లాడుతూ, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆయనతోపాటు సెక్రెటరీ కె.వి.ఎస్ గోవిందరావు, సభ్యుడు రంజిత్, రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఇన్ భద్రా సభ్యులు స్నేహ, భార్గవి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఐఎన్టీయూసీని నమ్ముకున్న ఏ కార్మికుడికీ నష్టం జరగదు

Divitimedia

బలప్రదర్శనతో సత్తా చాటిన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత దంపతులు

Divitimedia

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠినచర్యలు : డీఎంహెచ్ఓ

Divitimedia

Leave a Comment