Divitimedia
Bhadradri KothagudemInternational NewsLife StyleTelanganaWomen

జీకేఎఫ్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి దినోత్సవం

జీకేఎఫ్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి దినోత్సవం

మొక్కలు పంచి పెట్టిన సంస్థ ప్రతినిధులు

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సోంపల్లి గ్రామంలో జీకేఎఫ్ ఆగ్రోఫారెస్ట్రీ(అంజనాపురం) ఆధ్వర్యంలో మంగళవారం (అక్టోబరు 24) ఐక్యరాజ్య సమితి దినోత్సవం నిర్వహించారు. సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి అనేది అంతర్జాతీయంగా శాంతిభద్రతల దృష్ట్యా ప్రపంచదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటుచేసుకున్న అంతర్జాతీయ అధికారిక సంస్థ అని వివరించారు. 1945 అక్టోబర్‌ 24 ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చిన రోజు సందర్భంగా ప్రతి ఏడాది ఇదే రోజు ‘ఐక్యరాజ్యసమితిదినోత్సవం’గా నిర్వ హిస్తారని పేర్కొంటూ ఆ విశిష్టతను గ్రామ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగానే జీకేఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరి రక్షణకోసం సోంపల్లి గ్రామస్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీకేఎఫ్ సంస్థ ప్రతినిధులు రజియాబేగం, లలిత, సరస్వతి, సౌమ్య, రవితేజ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీసత్యసాయి స్కూల్ విద్యార్థులకు ఐటీసీ రోటరీ ఇన్‌భద్రా వితరణ 

Divitimedia

టీడీపీలో ముసలం, రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా

Divitimedia

త్వరలో రాష్ట్రంలో కుల గణన

Divitimedia

Leave a Comment