ప్రగతి విద్యానికేతన్ లో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు
✍🏽 దివిటీ మీడియా – సారపాక
ప్రకృతిని ఆరాధించే అతి పెద్దపండుగగా
బతుకమ్మ పండుగ పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో వస్తుందని, భూమితో, జలంతో, మానవులకుండే అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుందని ప్రగతి విద్యానికేతన్ హైస్కూల్ కరస్పాండెంట్ సానికొమ్ము బ్రహ్మారెడ్డి తెలిపారు. సారపాక లోని ప్రగతి విద్యానికేతన్ హైస్కూల్లో ఈ మేరకు గురువారం నిర్వహించిన ‘బతుకమ్మ సంబరాలు’ కార్యక్రమం చిన్నారుల కోలాహలంతో ఉత్సాహంగా సాగింది. బతుకమ్మ పండుగ జరుపుకునే వారమంతటా స్త్రీలు “బొడ్డెమ్మ (మట్టితో చేసే దుర్గాదేవి)ని బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారని బ్రహ్మా రెడ్డి తెలిపారు. శుక్రవారం నుంచి పాఠశాలలకు సెలవులు కావడంతో గురువారం పాఠశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. వేడుకలకు విద్యార్థులు, తల్లిదండ్రులు బతుకమ్మలతో తరలివచ్చి ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లదండ్రులు పాల్గొన్నారు.