భారత నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్
✍🏽 దివిటీ మీడియా – న్యూఢిల్లీ
వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ భారత నావికాదళం అధిపతిగా శుక్రవారం(అక్టోబర్ 6న) చీఫ్ ఆఫ్ పర్సనల్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1987 జులై 1న భారత నావికాదళంలోకి ప్రవేశించిన ఆయన, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌లో నిపుణుడు. ఆయన ప్రతిష్టాత్మకమైన ఖడక్వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీ, యునైటెడ్ కింగ్‌డమ్ శ్రీవెన్‌హామ్ జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, కరంజా నావల్ వార్‌ఫేర్ కళాశాల, యుఎస్ఎ రోడ్ ఐలాండ్, న్యూపోర్ట్ యునైటెడ్ స్టేట్స్ నావల్ వార్ కాలేజ్ పూర్వ విద్యార్థి. ‘అతి విశిష్ట సేవా పతకం’, ‘విశిష్ట సేవా పతకం’ గ్రహీత కూడా అయిన అడ్మిరల్ క్షిపణి వాహక నౌకలైన ‘ఐఎన్ఎస్ విద్యుత్’, వినాష్ కమాండ్‌తో సహా తన నౌకాదళ వృత్తిలో అనేక కీలక కార్యాచరణ, సిబ్బంది శిక్షణ, నియామకాల బాధ్యతలు నిర్వహించారు. క్షిపణి కార్వెట్ ఐఎన్ఎస్ కులిష్, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మైసూర్, విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య బాధ్యతలు కూడా నిర్వర్తించారు.
ఫ్లాగ్ ర్యాంక్‌కు పదోన్నతి పొందినప్పుడు ఆయన కొచ్చిలోని హెడ్‌క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్‌లో చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (ట్రైనింగ్)గా పనిచేశారు. ఇండియన్ నేవీలో అన్ని శిక్షణల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. నేవీ అన్ని విభాగాలలో కార్యాచరణ భద్రతను పర్యవేక్షించే ఇండియన్ నేవీ సేఫ్టీ టీమ్‌ను పెంచడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఫ్లాగ్ ఆఫీసర్ ‘సీ ట్రైనింగ్’ హోదాలో నేవీ ‘వర్క్ అప్ ఆర్గనైజేషన్’కు నాయకత్వం వహించారు. ఆ తర్వాత ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్- వెస్ట్రన్ ఫ్లీట్ బాధ్యతలలో నియమించబడ్డారు. స్వోర్డ్ ఆర్మ్‌కు నేతృత్వం వహించిన తర్వాత, ఆయన భారత ప్రభుత్వానికి ఆఫ్‌షోర్ డిఫెన్స్ అడ్వైజరీ గ్రూప్ ఫ్లాగ్ ఆఫీసర్, ఆఫ్‌షోర్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ అడ్వైజర్ గా నియమించబడ్డారు. అనంతరం వెస్ట్రన్ నేవల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించబడ్డారు. ఫ్లాగ్ ఆఫీసర్ తర్వాత నేవల్ హెడ్ క్వార్టర్స్ లో కంట్రోలర్ పర్సనల్ సర్వీసెస్ హోదాలో ప్రస్తుత బాధ్యతలు స్వీకరించే వరకు ఉన్నారు. అడ్మిరల్ స్వామినాథన్ న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ డిగ్రీ, కొచ్చిలోని కొచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం నుంచి టెలికమ్యూనికేషన్స్‌లో ఎంఎస్సీ, లండన్ కింగ్స్ కాలేజీ నుంచి డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఎ, ముంబై విశ్వవిద్యాలయం నుంచి స్ట్రాటజిక్ స్టడీస్ (వ్యూహాత్మక అధ్యయనాలు)లో ఎంఫిల్, ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ స్టడీస్‌లో పి.హెచ్.డి ఉన్నత విద్యార్హతలు పొందారు.