Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleTelanganaWomenYouth

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెనువిషాదం…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెనువిషాదం…

ఉరేసుకుని గర్భిణీ మృతి, పురుగుమందు తాగి భర్త ఆత్మహత్యాయత్నం

✍🏽 దివిటీ మీడియా – పినపాక, భద్రాద్రి కొత్తగూడెం

జీవితాంతం కలిసి బ్రతుకుదామనుకుని ప్రేమ వివాహం చేసుకున్న వారి జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలేమిటో తెలియదు గానీ, వారి జీవితం విచ్ఛిన్నమైంది. 8నెలల గర్భిణిగా ఉన్న ఆమె, తన కడుపులో పెరుగుతున్న తమ బిడ్డ గురించి కూడా ఏ మాత్రం ఆలోచించకుండా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, పురుగులమందు తాగిన ఆమె భర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామంలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్రవిషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… పినపాక మండలం ఉప్పాక గ్రామానికి చెందిన కాలేవారు సాయికుమార్(బీసీ), ఉప్పాక పంచాయతీకి చెందిన కారం స్వప్న(ఎస్టీ) ప్రేమతో  కులాంతర వివాహం చేసుకున్నారు. స్వప్న మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తుండగా, సాయికుమార్ 108 వాహన డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఏం జరిగిందో, ఏమో గానీ బుధవారం  మధ్యాహ్నం దాదాపు ఒంటిగంట సమయంలో స్వప్న ఇంట్లోనే ఉరివేసుకుని, తన కడుపులో పెరుగుతున్న 8 నెలల బిడ్డతో సహా మరణించింది. మరో నెలలో ఈ లోకాన్ని చూడాల్సిన ఆ పసిగుడ్డు తన తల్లిగర్భంలోనే అంతమై పోవాల్సి వచ్చింది.    స్వప్న మరణం తర్వాత ఆమె భర్త సాయికుమార్ కూడా మణుగూరు పట్టణ శివారులోని పాత ఇసుక బంకర్ వద్ద పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమంగా ఉన్న అతడిని చికిత్స కోసం  స్థానికులు అంబులెన్సులో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఏ పరిస్థితుల్లో ఆ భార్యాభర్తలు క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారో?, నిండు గర్భిణి స్వప్న ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో? పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. 

Related posts

ఆదమరిస్తే… అంతే సంగతులు…

Divitimedia

మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మరో కొరియర్ అరెస్ట్

Divitimedia

పీవైఎల్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

Divitimedia

Leave a Comment