ఐటీసీ రోటరీక్లబ్ ఆధ్వర్యంలో బాలికకు సైకిల్ వితరణ
✍🏽 దివిటీ మీడియా – సారపాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ రోటరీక్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం బానోతు కావేరి అనే విద్యార్థినికి సైకిల్ వితరణ చేశారు. ఆ బాలిక సారపాక జిల్లాపరిషత్ హైస్కూలులో పదవతరగతి చదువుతోంది. గాంధీనగర్ కు చెందిన కావేరి పాఠశాలకు వెళ్లివచ్చేందుకు ఆ సైకిల్ బహూకరించారు. కార్యక్రమంలో ఐటీసీ కాంట్రాక్టర్ దుర్గాప్రసాద్, ఐటీసీ హెచ్. ఆర్. అధికారి చంగల్ రావు, శ్రీను చేతుల మీదుగా సైకిల్ అందజేశారు.