Divitimedia
Life StyleNational NewsPoliticsTelangana

రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ ఛైర్మన్ గా తెలంగాణ పీఆర్సీ నియామకం

రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ ఛైర్మన్ గా తెలంగాణ పీఆర్సీ నియామకం

✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ‘పేస్కేల్’ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీ (పీఆర్సీ)ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు కమిటీ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్. శివశంకర్, సభ్యునిగా మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.రామయ్యను నియమించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) శాంతి కుమారి సోమవారం జీఓ(ఉత్తర్వులు) నెంబరు.159 జారీ చేశారు. ఈ పే రివిజన్ కమిటీ 6 నెలల్లోపు నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఈ పీఆర్సీలో బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 శాతం మధ్యంతర భృతి (ఇంటెరిమ్ రిలీఫ్) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Related posts

పినపాక నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన

Divitimedia

గృహలక్ష్మి పథకంలో అర్హులను మాత్రమే ఎంపిక చేయాలి

Divitimedia

మహిళల రక్షణే షీటీమ్స్ ప్రధాన లక్ష్యం : ఎస్పీ డా.వినీత్

Divitimedia

Leave a Comment