Divitimedia
Bhadradri KothagudemHyderabadKhammamPoliticsTelangana

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు కేటీఆర్ సహా మంత్రుల పర్యటన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు కేటీఆర్ సహా మంత్రుల పర్యటన

✍🏽 దివిటీ మీడియా – ఖమ్మం బ్యూరో

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లిలలో శనివారం (సెప్టెంబర్ 30) ముగ్గురు రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆ పర్యటన వివరాలు పేర్కొన్నారు. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్, రోడ్లు, భవనాలు, శాసన వ్యవహారాలు, హౌసింగ్ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. హైదరాబాదు బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 7-45 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 8-30 గంటలకు మంత్రులు కొణిజర్ల మండలం పరిధిలోని గుబ్బగుర్తిగ్రామం చేరుకుంటారు. అక్కడ గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ ఇంటిగ్రేటెడ్ పామాయిల్ కాంప్లెక్స్ కు భూమిపూజ చేసి రోడ్డు మార్గంలో ఖమ్మం మమత ఆసుపత్రి చేరుకుంటారు. ఆ తర్వాత లకారం ట్యాంక్ బండ్ మీద ఎన్టీఆర్ మున్సిపల్ పార్కుకు ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత రామచంద్రయ్య నగర్ లో స్పోర్ట్స్ పార్క్ ప్రారంభించనున్నారు. ప్రకాష్ నగర్, పోలేపల్లి ప్రాంతంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. సూర్యాపేట- అశ్వారావుపేట హైవేలో మున్నేరువాగుపై కేబుల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేస్తారు. వీడీఓస్ కాలనీలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కాంప్లెక్స్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఖమ్మం మున్సిపల్ కార్యాలయం వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మమత ఆసుపత్రి వద్ద నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12-30 గంటలకు బయలుదేరి భద్రాచలం టుబాకో బోర్డుకు వస్తారు. భద్రాచలం పట్టణంతోపాటు చర్ల, దుమ్ముగూడెం మండలాలకు వరద నుంచి రక్షణ కోసం నిర్మించనున్న కరకట్ట పనులకు శంకుస్థాపనలు చేస్తారు. భద్రాచలం పట్టణం అంబేద్కర్ సెంటర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం చర్ల రోడ్ లోని కె.కె ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ‘పాత్రికేయుల సమావేశం’లో పాల్గొంటారు. మధ్యాహ్నభోజనం తర్వాత ఖమ్మం జిల్లా సత్తుపల్లి పర్యటనకు హెలికాప్టర్లో వెళ్తారు. సత్తుపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 3-45 గంటలకు కాకర్లపల్లిరోడ్డులో చంద్రగార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన తర్వాత తిరిగి హైదరాబాదు వెళ్లిపోతారు. ఈ అధికారిక కార్యక్రమాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొననున్నారు. ఈమేరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

Related posts

ఆదివాసీ విద్యార్థికి హర్యానా రాజ్ భవన్ ఆతిథ్యం

Divitimedia

కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అశ్వనీవైష్ణవ్‌

Divitimedia

పీఎం కిసాస్ సమ్మాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని

Divitimedia

Leave a Comment