Divitimedia
Bhadradri KothagudemPoliticsTelangana

‘కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్న పాలకులు’

‘కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్న పాలకులు’

‘రెండో ఏఎన్ఎంలు, ఎన్.హెచ్.ఎం, 104 సిబ్బందిని క్రమబద్దీకరించండి’

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

దశాబ్దంన్నర కాలం నుంచి ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనాలు, చట్ట పరమైన హక్కులు, పనిభద్రత సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వం వారి శ్రమ దోచుకుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. స్టాఫ్ నర్స్ , ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ , డీఈఓ, సూపర్ వైజర్, కాంటెంజెన్సీ వర్కర్స్ ఇంకా ఎన్నేళ్లు ఈ ప్రభుత్వాలకు ఊడిగం చేయాలని ఆయన ప్రశ్నించారు. క్రమబద్ధీకరణ డిమాండ్ తో నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న సందర్భంగా కలెక్టరేట్ ధర్నా చౌక్ లో రెండో ఏఎన్ఎంలు, నేషనల్ హెల్త్ మిషన్, 104 సిబ్బంది వేర్వేరుగా ఏర్పాటు చేసుకున్న నిరసన శిభిరాలను శనివారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమబతుకులు బాగుపడతాయని ఆశించిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల ఆశలను ముఖ్యమంత్రి కేసీఆర్ నీరుగార్చారని, తమ ప్రభుత్వం ఏర్పడితే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థలను రద్దు చేసి అందరినీ రెగ్యులర్ చేస్తామన్న సీఎం మాటలు తొమ్మిదేళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదన్నారు. కొన్ని శాఖల సిబ్బందిని క్రమబద్దీకరించి, మరికొందరికి వేతనాలు పెంచి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఉద్యోగ, కార్మిక, ప్రజాఉద్యమాలంటే సీఎం కేసీఆర్ తట్టుకోలేరని అందుకే సమ్మెలను విచ్ఛిన్నం చేసేందుకు నోటీసులు, హెచ్చరికలతో సమ్మె ఉద్యమకారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైద్యశాఖలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అదైర్య పడొద్దని, వారికి కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చి క్రమబద్దీకరణ హామీ ఇచ్చేంత వరకు సమ్మె ఉద్యమం మోసేందుకు కమ్యూనిస్టు పార్టీ, ఏఐటియుసి సిద్దంగా ఉంటాయని అన్నారు. ప్రభుత్వం మొండివైఖరి విడనాడి చర్చల ద్వారా వైద్య సిబ్బంది న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా, జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు నరాటి ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు వేల్పుల మల్లికార్జున్, ఎన్.హెచ్.ఎం ఉద్యోగులు శ్రీనివాస్, సింధు, జోగ లక్ష్మి, సత్తిబాబు, సుదర్శన్, నాగమణి, వీరన్న, పార్వతి, మాధవి, సజ్జుబేగం, ప్రియాంక, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

Divitimedia

డీఎస్సీ పరీక్షకేంద్రం వద్ద సెక్షన్ 163 సెక్షన్

Divitimedia

ప్రైవేటు ఏజెన్సీ గుప్పిట్లో ‘ధరణి’ పోర్టల్…

Divitimedia

Leave a Comment