ఎస్సైగా ఎంపికైన తేజేశ్వర్ రెడ్డికి ‘నేస్తం ట్రస్ట్’ సన్మానం
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజర్ గ్రామం నుంచి ఇటీవల ఎస్సైగా ఎంపికైన మేడం తేజేశ్వర్ రెడ్డికి ఆదివారం గ్రామానికి చెందిన ‘నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఘనసన్మానం చేశారు. మేడం కళావతి, తిరిపాలరెడ్డి పెద్ద కుమారుడైన తేజేశ్వర్ రెడ్డి ఇటీవల విడుదలైన ఎస్సై పరీక్షల ఫలితాల్లో సివిల్ ఎస్సైగా ఉద్యోగం సాధించిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. తేజేశ్వర్ రెడ్డిని ఘనంగా సన్మానించి, సన్మానపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బూర్గంపాడు మండల జడ్పీటీసీసభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, తహశీల్దార్ రాజారావు, ఎస్సై రాజ్ కుమార్, స్థానిక సర్పంచ్ భూక్యా దివ్యశ్రీ , ట్రస్ట్ ఛైర్మన్ బత్తుల రామ కొండారెడ్డి మాట్లాడారు. తేజేశ్వర్ రెడ్డి తండ్రి తిరిపాలరెడ్డి అతని చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించినప్పటికీ అతని తల్లి కళావతి మనోధైర్యం కోల్పోకుండా ఇద్దరు కుమారులను బాగా చదివించి ఉన్పతస్థితికి రావడానికి కారణమయ్యారని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తేజేశ్వర్ రెడ్డి చిన్నతనం నుంచి చదువుల్లో ముందుండి, ఇంజనీరింగ్ తర్వాత క్యాంపస్ సెలక్షన్ లో ఉద్యోగం వచ్చినప్పటికీ ఎస్సై కావాలనే పట్టుదలతో దానికి రిజైన్ చేసి అనుకున్నది సాధించడం పట్ల అభినందనలు తెలిపారు. తన విజయం కుటుంబసభ్యులతో పాటు గ్రామానికి ఎంతో గర్వకారణమన్నారు. తన వృత్తి పట్ల అంకితభావంతో ముందుకు సాగి భవిష్యత్తులో తేజేశ్వర్ రెడ్డి ఉన్నతస్థాయిని అందుకోవాలని, స్థానిక యువత ఆదర్శంగా తీసుకొని ఉన్నతస్థానంలో వుండాలని ఈ సందర్భంగా వక్తలు కోరారు. కార్యక్రమంలో జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోాధ్యాయుడు కొండ్రు వెంకటేశ్వర్లు, స్థానిక సొసైటీ డైరెక్టర్ బి రామకొండారెడ్డి, గ్రామ పెద్దలు కైపు సుబ్బరామిరెడ్డి, దామోదర్ రెడ్డి, పరివర్తన సేవా సమితి అధ్యక్షులు కామిరెడ్డి నాగిరెడ్డి, నేస్తం ట్రస్ట్ వైస్ ఛైర్మన్ చింతా అంకిరెడ్డి, గ్రామ పంచాయితీ కార్యదర్శి భవాని, గ్రామ పెద్దలు గాదె నర్సిరెడ్డి,వీర్రాజు, వెంకటేశ్వర్లు, మాజీ సొసైటీ డైరెక్టర్ కైపు నాగిరెడ్డి, ట్రస్ట్ సభ్యులు ఐ వి రాజేష్, జింకల రాంగోపాల్ రెడ్డి, పేరం రామిరెడ్డి, ఆవుల శివనాగిరెడ్డి, సంకా సురేష్, కైపు రమేష్ రెడ్డి, బత్తుల మల్లీశ్వరి, ఇండ్ల సౌజన్య, వార్డుసభ్యులు కామిరెడ్డి పద్మ, రామలక్ష్మి, పుల్లారెడ్డి, సీతారామిరెడ్డి, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.